News February 26, 2026
ALERT: కాజీపేటలో కల్తీ ఐస్‌క్రీం స్వాధీనం

కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని విష్ణుపురిలో టాస్క్ ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో కల్తీ ఐస్‌క్రీంలతో పాటు గడువు తీరిన రూ.60,400 విలువలైన 12 రకాల ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు పాటించని షాపు యజమానిని అదుపులోకి తీసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ ACP మధుసూదన్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న సామగ్రిని విచారణ నిమిత్తం ఫుడ్ సేఫ్టీ అధికారులకు అప్పగించారు.
Similar News
News April 18, 2026
నెల్లూరు: విషాదం.. ఈతకు వెళ్లి విద్యార్థి మృతి

లింగసముద్రం (M)లో విషాద ఘటన చోటుచేసుకుంది. జంపాలవారిపాలానికి చెందిన ఏడో తరగతి విద్యార్థి గడ్డం వినయ్ బాబు స్నేహితులతో కలిసి జంగారెడ్డిపాలెం సమీపంలోని చెక్‌డ్యాం వద్ద ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. SI రాంబాబు దర్యాప్తు చేపట్టారు. శనివారం మృతదేహాన్ని చెక్‌డ్యాం నుంచి వెలికి తీసి పోస్టుమార్టం కోసం కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు.
News April 18, 2026
బాలయ్య-కొరటాల కాంబోలో సినిమా?

నటసింహం నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో సినిమా రానున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో తీస్తున్న సినిమా షూటింగ్‌లో బాలయ్య బిజీగా ఉండగా.. ఇది పూర్తయ్యాక కొరటాల ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. బాలయ్య బాడీ లాంగ్వేజ్‌కు సరిపడే పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను కొరటాల సిద్ధం చేశారని, ‘దేవర-2’కి ముందే ఇది రాబోతుందని సమాచారం.
News April 18, 2026
KNR: నేడు ఎలగందల్ కోటలో ఉచిత ప్రవేశం

కరీంనగర్ జిల్లాలో చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ఎలగందల్ కోటను సందర్శించాలని భావిస్తున్న వారికి అధికారులు శుభవార్త తెలిపారు. ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా నేడు కోటను సందర్శించే వారికి ఉచిత ప్రవేశాన్ని కల్పించారు. ఈ ప్రత్యేక అవకాశాన్ని ఉపయోగించుకొని కోటను సందర్శించుకోవాలని పర్యాటకులకు అధికారులు సూచించారు. ఎలగందల్ కోట తన వైభవమైన చరిత్ర, అద్భుత నిర్మాణ శైలితో ప్రసిద్ధి చెందింది.


