News March 26, 2025
ALERT.. బాపట్లలో 28న జరిగే కార్యక్రమం రద్దు

ఎస్టీలు, దివ్యాంగుల కొరకు శుక్రవారం నిర్వహించే ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఈనెల 28వ తేదీన తాత్కాలికంగా రద్దు చేసినట్లు బాపట్ల కలెక్టర్ జె.వెంకట మురళి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అనివార్య కారణాలు, పరిపాలన సౌలభ్యంలో భాగంగా మార్చి నెలలో జరగవలసిన ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ మాత్రమే రద్దు చేశామన్నారు. ఫిర్యాదుదారులు ఎవరూ శుక్రవారం కలెక్టరేట్కి రావద్దని సూచించారు.
Similar News
News November 17, 2025
అమలాపురం: పీజీఆర్ఎస్కు 29 ఫిర్యాదులు

అమలాపురంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ రాహుల్ మీనా ఆధ్వర్యంలో సోమవారం ‘పీజీఆర్ఎస్’ (పోలీస్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్) జరిగింది. ఇందులో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 29 సమస్యలు వచ్చాయి. లిఖితపూర్వకంగా అర్జీలు స్వీకరించిన ఎస్పీ, వాటిని చట్ట పరిధిలో విచారించి, త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు.

చిత్తూరు పోలీసులకు అందిన 38 ఫిర్యాదులు

చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ తుషార్ డూడీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలపై 38 ఫిర్యాదులు అందినట్టు అధికారులు తెలిపారు. వీటిని చట్టప్రకారం విచారించి బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఎస్పీ సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు పాల్గొన్నారు.