News March 21, 2025
ALERT: మన్యం జిల్లాకు వర్ష సూచన

భగ్గమంటున్న ఎండలు, ఉక్కబోతతో అల్లాడిన మన్యం జిల్లా వాసులకు APSDMA చల్లటి కబురు చెప్పింది. జిల్లాలో శనివారం వడగాలులు, ఆదివారం వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. పిడుగులతో కూడిన తేలికపాటి, మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ప్రజలు చెట్ల క్రింద నిలబడరాదని AP డిజాస్టర్ మేనేజ్మెంట్ తెలిపింది.
Similar News
News December 3, 2025
BREAKING విశాఖ: స్పా సెంటర్పై దాడి.. ఐదుగురు అరెస్ట్

గాజువాక 80 ఫీట్ల రోడ్డులోని ఓ స్పా సెంటర్ పై సిటీ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఒక విటుడు, ఆర్గనైజరు, మేనేజర్, ఇద్దరు మహిళలను సిటీ టాస్క్ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిని గాజువాక పోలీసులకు అప్పగించి కేసు నమోదు చేశారు. అసాంఘిక కార్యకలాపాలు ఎక్కడ జరిగినా సమాచారం ఇవ్వాలని టాస్క్ఫోర్స్ సీఐ అప్పలనాయుడు ప్రజలను కోరారు.
News December 3, 2025
రైతన్న మీకోసం వర్క్ షాప్లో కలెక్టర్

పెదపాడు మండలం అప్పన్నవీడులో బుధవారం రైతన్న మీకోసం వర్క్షాప్ జరిగింది. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి పాల్గొన్నారు. రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామని, ఎక్కువ విస్తీర్ణంలో సాగు అయ్యేందుకు కృషి చేయాలని అన్నారు. సాగులో ఉత్తమ యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించాలని తెలిపారు.
News December 3, 2025
ఈనెల 5న డివిజన్ల వారీగా ఎన్నికల శిక్షణ: కలెక్టర్ ప్రావీణ్య

పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఈనెల 5వ తేదీన డివిజన్ల వారీగా ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. సంగారెడ్డి, ఆందోల్, పటాన్చెరు, జహీరాబాద్, నారాయణఖేడ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఉదయం 10 గంటలకు శిక్షణ కార్యక్రమం ప్రారంభమవుతుందని ఆమె చెప్పారు. గతంలో శిక్షణకు హాజరుకాని ఉద్యోగులు తప్పనిసరిగా హాజరుకావాలని కలెక్టర్ సూచించారు.


