News March 21, 2025

ALERT: మన్యం జిల్లాకు వర్ష సూచన

image

భగ్గమంటున్న ఎండలు, ఉక్కబోతతో అల్లాడిన మన్యం జిల్లా వాసులకు APSDMA చల్లటి కబురు చెప్పింది. జిల్లాలో శనివారం వడగాలులు, ఆదివారం వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. పిడుగులతో కూడిన తేలికపాటి, మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ప్రజలు చెట్ల క్రింద నిలబడరాదని AP డిజాస్టర్ మేనేజ్మెంట్ తెలిపింది.

Similar News

News April 23, 2025

వాల్టా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి: కలెక్టర్

image

భూగర్భ వనరులను కాపాడుతూ.. నీటిని సంరక్షించేందుకు ప్రభుత్వం రూపొందించిన వాల్టా చట్టంని జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. భూగర్భ జలాల పరిరక్షణపై భూగర్భ జలాల పరిరక్షణ కమిటీ సమావేశాన్ని జనగామ కలెక్టరేట్‌లో నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భూగర్భ జలాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని, భూగర్భ జలాలను కాపాడుతూ వాటిని పెంపొందించాలన్నారు.

News April 23, 2025

నలుగురిపై కేసు.. ముగ్గురి అరెస్ట్: ADB SP

image

రౌడీయిజాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తామని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో 2 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. సయ్యద్ యాసిన్, జనాబ్, ముబారక్‌లపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. రెండవ కేసులో హబీబ్, సర్దార్ (పరారీ) కేసు నమోదు చేశామన్నారు. వీరిలో ముగ్గురిని అరెస్టు చేశామని.. ఒకరు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. రౌడీయిజం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News April 23, 2025

నిర్మల్: ‘LRS క్రమబద్ధీకరణ రుసుంలో 25% రాయితీ’

image

ఆమోదం పొందిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులంతా క్రమబద్ధీకరణకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ఆదేశించారు. ఎల్ఆర్ఎస్ లేఔట్ల క్రమబద్ధకరణకు దరఖాస్తు చేసుకున్న వారిలో ఆమోదం పొందిన దరఖాస్తుదారులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుల క్రమబద్ధీకరణకు ఆర్థిక భారం తగ్గించేందుకు ప్రభుత్వం గ్రామీణ, పట్టణ ప్రాంతాల పరిధిలో రుసుంలో 25% రాయితీ కల్పించిందన్నారు.

error: Content is protected !!