News December 27, 2024

ALERT.. వరంగల్: డిగ్రీ విద్యార్థులకు గమనిక

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ విద్యార్థులకు నేడు జరగబోయే మొదటి, ఐదవ సెమిస్టర్‌కు సంబంధించిన పరీక్షలు వాయిదా వేసినట్లు రిజిస్ట్రార్ మల్లారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. వాయిదా పడిన పరీక్షలు ఈనెల(డిసెంబర్) 31న నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. తదుపరి పరీక్షలు యథావిధిగా షెడ్యూల్ ప్రకారం ఉంటాయని అన్నారు.

Similar News

News January 21, 2025

నైపుణ్య అభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు చర్యలు: కలెక్టర్

image

మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దటానికి జిల్లా కేంద్రంలో నైపుణ్య అభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని వరంగల్ కలెక్టర్ సత్య శారద దేవి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని ఔత్సాహిక మహిళలకు ఆర్థిక స్వాలంబన కల్పించేందుకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు.

News January 21, 2025

పెండింగ్ కేసులపై దృష్టి పెట్టండి: ఏసీపీ దేవేందర్ రెడ్డి

image

పోలీస్ స్టేషన్ల పరిధిలో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలని హనుమకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి అధికారులకు సూచించారు. హనుమకొండ డివిజన్ పోలీస్ అధికారులతో ఏసీపీ నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. చోరీలను కట్టడి చేయడం కోసం పోలీస్ స్టేషన్ పరిధిలో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని స్టేషన్ అధికారులకు సూచించారు.

News January 21, 2025

గ్రామ సభలో పాల్గొన్న వరంగల్ పోలీస్ కమిషనర్

image

నేటి నుంచి ప్రారంభమైన గ్రామ సభల కార్యక్రమంలో భాగంగా నగరంలోని డివిజన్ల పరిధిలో నిర్వహిస్తున్న గ్రామ సభలకు వరంగల్ పోలీస్ కమిషనర్ హాజరువుతున్నారు. ఇందులో భాగంగా 22వ డివిజన్లో నిర్వహించిన గ్రామ సభకు పోలీస్ కమిషనర్ పాల్గొని పోలీస్ బందోబస్తుతో పాటు సభ ఏర్పాట్లును పరిశీలించారు. ఈ సభలకు స్థానిక ప్రజా ప్రతినిధులు, రెవెన్యూ అధికారులు, వరంగల్ ఏసీపీ నందిరాం మట్టేవాడ ఇన్‌స్పెక్టర్ పాల్గొన్నారు.