News February 23, 2025
ALERT.. వేలేరు పరీక్షా కేంద్రం- 254302

వేలేరు గురుకుల పాఠశాలలో ఆదివారం నిర్వహిస్తున్న టీజీ సెట్ 2025 ప్రవేశ పరీక్షకు అభ్యర్థులు సకాలంలో హాజరుకావాలని బాలుర గురుకుల పాఠశాల&కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అజయ్ కుమార్ రౌతు ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లో పాఠశాల పేరు ఇవ్వకుండా సెంటర్ నెం-254302 మాత్రమే ప్రచురించిన విషయాన్ని అభ్యర్థులు గుర్తించాలని కోరారు. 11 గంటలకు జరిగే ప్రవేశ పరీక్షకు ఒక గంట ముందుగానే హాజరుకావాలన్నారు.
Similar News
News March 15, 2025
గద్వాల: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

అంతర్ రాష్ట్ర రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాలు.. మానవపాడు మం. చెన్నిపాడుకి చెందిన రవీంద్రనాథ్ రెడ్డి (34) తన తల్లి సుబ్బమ్మతో కలిసి కలుగొట్ల గ్రామంలో నివాసం ఉంటున్నారు. వ్యక్తిగత పనులు ముగించుకొని ఇంటికి వస్తున్న క్రమంలో అలంపూరు చౌరస్తా నుంచి శాంతినగర్ వెళ్లేదారిలో గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు.
News March 15, 2025
నెల్లూరు: ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ పరీక్షలు

నెల్లూరు జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రధాన పరీక్షలు శనివారంతో ప్రశాంతంగా ముగిశాయని జిల్లా ప్రాంతీయ ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారి డాక్టర్ ఏ. శ్రీనివాసులు తెలిపారు. శనివారం జరిగిన పరీక్షల జనరల్ విభాగంలో 23,199 మందికి గాను 458 మంది గైర్హాజరు అయ్యారని తెలిపారు. ఒకేషనల్ విభాగంలో 431 మందికి గాను 61 మంది గైర్హాజరు అయ్యారు. ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరగడంతో జిల్లా అధికారులందరికీ ఆర్‌ఐఓ ధన్యవాదాలు తెలిపారు.
News March 15, 2025
మళ్లీ నేనే సీఎం: రేవంత్ రెడ్డి

TG: రెండోసారి కూడా తానే సీఎం అవుతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో చిట్‌చాట్‌లో అన్నారు. ‘తొలిసారి BRSపై వ్యతిరేకతతో మాకు ఓటు వేశారు. రెండోసారి మాపై ప్రేమతో వేస్తారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులే మా ఓటర్లు. నా పనిని నమ్ముకుని ముందుకు వెళ్తున్నా. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటాం’ అని తెలిపారు.