News November 17, 2024
ALERT: హైదరాబాద్ ఫుడ్ డేంజర్!

HYDలోని రెస్టారెంట్లలో క్వాలిటీ తగ్గుతోంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సర్వే ఇందుకు నిదర్శనం. దేశంలోని 19 ప్రధాన నగరాల్లో HYD కల్తీలో నం.1 అని సర్వే పేర్కొంది. ఏకంగా 62% హోటళ్లు గడువు ముగిసిన ఆహార పదార్థాలు కస్టమర్లకు వడ్డిస్తున్నట్లు పేర్కొంది. గడిచిన 2 నెలల వ్యవధిలోనే 84% ఫుడ్ పాయిజన్ కేసులు నగరంలో నమోదు కావడం గమనార్హం. దీంతో GHMC అప్రమత్తమైంది. అన్ని హోటల్స్‌లో తనిఖీలు చేపట్టింది.
Similar News
News October 21, 2025
జూబ్లీ బైపోల్.. నేటితో నామినేషన్ల గడువు పూర్తి

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల గడువు నేటితో ముగియనుంది. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 127 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవాళ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. రేపు నామినేషన్లను పరిశీలించనున్నారు. 24న ఉపసంహరణకు తుది గడువు. నవంబర్ 11న పోలింగ్, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు జరగనుంది.
News October 21, 2025
HYD: సదర్ ఉత్సవం.. దద్దరిల్లనున్న సిటీ

HYDలో యాదవులు నేడు సదర్ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. దీపావళి తర్వాత జరిగే ఈ పండుగ కోసం ఖైరతాబాద్, బోయిన్పల్లి, మూసాపేట్ వంటి ప్రాంతాలు సిద్ధమయ్యాయి. హరియాణా నుంచి భారీ దున్నరాజులు ఇప్పటికే నగరానికి చేరుకున్నాయి. యాదవ సోదరులు తమ దున్నరాజులతో డప్పులు, ఆటపాటల నడుమ ఊరేగింపుగా వచ్చి, ఒకచోట సదర్‌ను జరుపుకుంటారు.
News October 21, 2025
HYD: సదర్.. దున్నరాజుకు రూ.31 వేల మద్యం

ముషీరాబాద్‌లో సదర్ ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో కేరళ నుంచి తెచ్చిన 2,500 కిలోల ‘దున్నరాజు’ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఉత్సవంలో యాదవులు రూ.31,000 విలువైన ‘రాయల్ సెల్యూట్’ బాటిల్‌ను దున్నరాజుకు తాగించారు. ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నగరంలో సదర్ ఉత్సవాలు మరింత ఉత్సాహంగా జరుగుతున్నాయి.