News November 17, 2024

ALERT: హైదరాబాద్ ఫుడ్ డేంజర్!

image

HYDలోని రెస్టారెంట్లలో క్వాలిటీ తగ్గుతోంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సర్వే ఇందుకు నిదర్శనం. దేశంలోని 19 ప్రధాన నగరాల్లో HYD కల్తీలో నం.1 అని సర్వే పేర్కొంది. ఏకంగా 62% హోటళ్లు గడువు ముగిసిన ఆహార పదార్థాలు కస్టమర్లకు వడ్డిస్తున్నట్లు పేర్కొంది. గడిచిన 2 నెలల వ్యవధిలోనే 84% ఫుడ్ పాయిజన్ కేసులు నగరంలో నమోదు కావడం గమనార్హం. దీంతో GHMC అప్రమత్తమైంది. అన్ని హోటల్స్‌లో తనిఖీలు చేపట్టింది.

Similar News

News November 19, 2025

HYD: ఈనెల 19న పీజీ, పీహెచ్‌డీ ప్రవేశాలకు కౌన్సిలింగ్‌

image

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన PG & PhD ప్రవేశాలకు 2వ విడత కౌన్సిలింగ్ ఈనెల 19న జరగనుంది. యూనివర్సిటీ ఆడిటోరియంలో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్నారు. ఆసక్తి, అర్హులైన అభ్యర్థులు హాజరు కావాలని, ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.

News November 18, 2025

శంషాబాద్ నుంచి సౌదీకి ప్రత్యేక విమానం

image

సౌదీ అరేబియాలో జరిగిన ప్రమాద ఘటన బాధితుల కోసం ప్రభుత్వం శంషాబాద్ నుంచి సౌదీకి ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఘటనలో మృతి చెందిన వారిని గుర్తించి, అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మృతుల రక్త సంబంధికులను ఈరోజు రాత్రి 8.30 గంటలకు నాంపల్లి హజ్ హౌస్ నుంచి సౌదీకి పంపనున్నారు.

News November 18, 2025

శంషాబాద్‌: గర్భంలోనే కవలలు మృతి.. భర్త ఆత్మహత్య

image

భార్య గర్భంలోని కవలలు మృతిచెందారనే దుఃఖంతో శంషాబాద్‌లోని సామ ఎన్‌క్లేవ్‌లో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆతహత్య చేసుకున్నాడు. పోలీసుల ప్రకారం.. కర్ణాటకకు చెందిన ముత్యాల విజయ్ భార్య శ్రావ్య 8 నెలల గర్భిణీ. కవలల మరణ వార్త తెలిసి విజయ్ తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.