News November 17, 2024

ALERT: హైదరాబాద్ ఫుడ్ డేంజర్!

image

HYDలోని రెస్టారెంట్లలో క్వాలిటీ తగ్గుతోంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సర్వే ఇందుకు నిదర్శనం. దేశంలోని 19 ప్రధాన నగరాల్లో HYD కల్తీలో నం.1 అని సర్వే పేర్కొంది. ఏకంగా 62% హోటళ్లు గడువు ముగిసిన ఆహార పదార్థాలు కస్టమర్లకు వడ్డిస్తున్నట్లు పేర్కొంది. గడిచిన 2 నెలల వ్యవధిలోనే 84% ఫుడ్ పాయిజన్ కేసులు నగరంలో నమోదు కావడం గమనార్హం. దీంతో GHMC అప్రమత్తమైంది. అన్ని హోటల్స్‌లో తనిఖీలు చేపట్టింది.

Similar News

News December 13, 2024

వికారాబాద్: హాస్టల్లో డైట్ కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించాలి: కలెక్టర్ 

image

జిల్లాలోని ఎస్సీ, బీసీ మైనార్టీ గిరిజన అన్ని సంక్షేమ వసతి గృహాలు రెసిడెన్షియల్ కేజీబీవీ పాఠశాలల్లో ఈనెల 14వ తేదీన నూతన డైట్ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. శుక్రవారం వికారాబాద్ కల్లెక్టరేట్‌లో కాన్ఫరెన్స్ హాలు నుంచి అన్ని సంక్షేమ వసతి గృహాలు రెసిడెన్షియల్ కేజీబీవీ పాఠశాల ప్రిన్సిపల్స్‌తో వీడియో కాన్ఫరెన్స్ కలెక్టర్ నిర్వహించారు.  

News December 13, 2024

HYD: KTR వద్దకు సివిల్ ఇంజినీర్లు..!

image

HYDలో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR వద్దకు వెళ్లిన సివిల్ ఇంజినీర్లు, డిప్యూటీ సర్వేయర్ల నియామకంలో జరగబోయే అన్యాయాన్ని వివరించారు. ఎలాంటి క్వాలిఫికేషన్‌లేని వీఆర్వోలను డిప్యూటీ సర్వేయర్లుగా కేటాయిస్తే చరిత్రలోనే పెద్ద తప్పుగా మిగులుతుందని అభ్యర్థులు వాపోయారు. అభ్యర్థుల పక్షాన పోరాడుతానని KTR సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. ఇందులో సర్వేయర్లు, గతంలో పరీక్ష రాసిన వారు పాల్గొన్నారు.

News December 13, 2024

HYD: సోలార్ పవర్‌తో నడిచే యంత్ర తయారీకి గ్రీన్ సిగ్నల్

image

HYDలోని పటాన్‌చెరు వద్ద ఉన్న ఇక్రిశాట్ సౌరశక్తితో నడిచే గుర్రపు డెక్క తొలగించే హార్వెస్టర్ కోసం భారతదేశంలోనే మొదటి పారిశ్రామిక డిజైన్ గ్రాంట్ పొందింది. HYD వ్యాప్తంగా చెరువులలో ఉన్న గుర్రపు డెక్క మొక్కను తొలగించటం కోసం ప్రస్తుతం డీజిల్ ఇంధనం ద్వారా నడిచే యంత్రాలను ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. సోలార్ పవర్ హార్వెస్టర్ అందుబాటులోకి వస్తే లాభం చేకూరనుంది.