News March 21, 2025

ALERT: అల్లూరి జిల్లాకు వర్ష సూచన

image

భగ్గమంటున్న ఎండలు, ఉక్కబోతతో అల్లాడిన అల్లూరి జిల్లా వాసులకు APSDMA చల్లటి కబురు చెప్పింది. జిల్లాలో శనివారం వడగాలులు, ఆదివారం వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. పిడుగులతో కూడిన తేలికపాటి, మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ప్రజలు చెట్ల క్రింద నిలబడరాదని AP డిజాస్టర్ మేనేజ్మెంట్ తెలిపింది.

Similar News

News February 15, 2026

వృద్ధాప్యంలో ఒంటరితనం వేధిస్తోందా?

image

వృద్ధాప్యంలో ఒంటరితనం అతి పెద్ద సమస్య. పిల్లలు ఎక్కడో దూరంగా ఉండడం, ఏమైనా అయితే పిల్లలు రాగలరో లేరో అనీ కలవరపడతారని నిపుణులు చెబుతున్నారు. ఒంటరితనంతో గతం గురించి ఆలోచిస్తూ కుంగుబాటుకూ లోనవుతారు. రోజూ కాసేపు ధ్యానం చేయడం, స్నేహితులు, బంధువులో సమయం గడపడం వంటివి మేలు చేస్తాయంటున్నారు. మనసును ఉల్లాసంగా ఉంచుకుంటే ఒంటరిననే భావన తగ్గుతుందని చెబుతున్నారు.

News February 15, 2026

హీరో నిఖిల్ వివాదాస్పద పోస్ట్.. ఎవరి గురించి?

image

హీరో నిఖిల్ నటించిన ‘స్వయంభు’ సినిమా నుంచి ఇటీవల ఎపిక్ టీజర్‌ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. టెక్నికల్ సమస్య వల్ల ఈ టీజర్‌ను యూట్యూబ్‌లో రీఅప్‌లోడ్ చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ‘యూట్యూబ్ భయ్యా ఎందుకిలా టెక్నికల్ గ్లిచ్ వచ్చేలా చేశావ్.. ఇటీవల రిలీజైన సినిమాల్లాగా మా మూవీలో AI యూజ్ చేయలేదు’ అని నిఖిల్ ట్వీట్ చేశారు. దీంతో ఆయన ఎవరిని, ఏ సినిమాను ఉద్దేశించి ఇలా కామెంట్ చేశారనే చర్చ మొదలైంది.

News February 15, 2026

RGM: సీఎంను కలిసిన కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు

image

రామగుండం కార్పొరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించిన కార్పొరేటర్లకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. HYDలోని ముఖ్యమంత్రి నివాసంలో ఆయనను ఆదివారం కాంగ్రెస్ కార్పొరేటర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. డివిజన్లలో ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనలో బాధ్యతాయుతంగా పని చేయాలని, అభివృద్ధిపై దృష్టి సారించాలని సీఎం సూచించారు. MLA- MS రాజ్ ఠాకూర్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.