News January 12, 2026
ALERT: ఈ కోడ్స్‌తో కాల్స్ చేయొద్దు!

సైబర్ నేరగాళ్లు కాల్ ఫార్వర్డింగ్ స్కామ్స్‌కు తెరలేపారు. డెలివరీ ఏజెంట్లమని చెబుతూ USSD కోడ్‌లతో కాల్స్ చేయించి యూజర్ల OTPలు తమకు వచ్చేలా చేస్తున్నారు. తర్వాత ఆయా ఖాతాల్లోని డబ్బు కాజేస్తున్నారు. 21, 61, 67 వంటి USSD కోడ్‌లతో మొదలయ్యే నంబర్లకు డయల్ చేయొద్దని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. కాల్ ఫార్వర్డింగ్ యాక్టివేట్ అయిందని భావిస్తే ##002#కి డయల్ చేసి డీయాక్టివేట్ చేయాలని చెబుతున్నారు.
Similar News
News February 13, 2026
ఇంపోర్టెడ్ ఆపిల్స్ తింటున్నారా?

‘ఇంపోర్టెడ్’ ఆపిల్స్ కంటే మన దేశీ కశ్మీరీ, హిమాచల్ ఆపిల్స్ ఆరోగ్యానికి ఎంతో మేలని వైద్యులు సూచిస్తున్నారు. విదేశీ పండ్లు నెలల తరబడి నిల్వ ఉండటం వల్ల వాటిలోని విటమిన్-C 85% వరకు తగ్గిపోతుందని తెలిపారు. మన ఆపిల్స్‌లో గుండెకు మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్స్, సహజమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయని వివరించారు. మెరిసే వ్యాక్స్ పూత ఉన్న విదేశీ పండ్ల కంటే తాజాగా దొరికే స్వదేశీ ఆపిల్స్ తీసుకోవాలని చెబుతున్నారు.
News February 13, 2026
శివ నామాలు అర్థాలు ‘‘శూలపాణి’’

శివుడి ఆయుధం త్రిశూలం. దీనిని చేతిలో ధరించిన వాడు కాబట్టి ఆయన ‘శూలపాణి’ అయ్యాడు. త్రిశూలంలోని మూడు కొనలు సత్వ, రజ, తమ గుణాలకు; అలాగే భూత, భవిష్యత్, వర్తమాన కాలాలకు సంకేతం. వాటన్నింటినీ తన అధీనంలో ఉంచుకుని లోకాన్ని రక్షించేవాడు శివుడు. మనలోని అరిషడ్వర్గాలను తన శూలంతో సంహరించి, మనల్ని సన్మార్గంలో నడిపిస్తాడు. దుష్ట శిక్షణ కోసం, శిష్ట రక్షణ కోసం నిరంతరం సిద్ధంగా ఉండే రక్షకుడు ఆయన.
News February 13, 2026
ఘన జీవామృతం తయారీకి కావాల్సిన పదార్థాలు

☛ దేశీ ఆవుపేడ 100kgలు ☛ దేశీ ఆవు మూత్రం 5లీటర్లు ☛ బెల్లం 2kgలు ☛ పప్పు దినుసుల పిండి 2kgలు (శనగ, ఉలవ, పెసర, మినుము ఏదైనా) ☛ గుప్పెడు పుట్టమట్టి
తయారీ: ఈ పదార్థాలను 100KGలు బాగా చివికిన పశువుల పేడలో వేసి చేతితో బాగా కలిపి, దానిపై 5 లీటర్ల ఆవుమూత్రాన్నిచల్లి, బాగా కలియబెట్టి కుప్పగా చేసి గోనెపట్టా కప్పాలి. 48 గంటల తర్వాత పలుచగా ఆరబెట్టుకోవాలి. ఇలా 10 రోజులు ఆరబెడితే ఘనజీవామృతం సిద్ధమవుతుంది.


