News November 1, 2024

ALERT: ఈ రైళ్లు విజయవాడలో ఆగవు

image

ప్రయాణికుల రద్దీ మేరకు రాయనపాడు మీదుగా సికింద్రాబాద్(SC), సత్రాగచ్చి(SRC) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నవంబర్ 1,8, 15 తేదీలలో SRC- SC(నం.08845), నవంబర్ 2, 9,16 తేదీలలో SC- SRC(నం.08846) మధ్య ఈ ట్రైన్లు నడుపుతామన్నారు. ఈ ప్రత్యేక రైళ్లు విజయవాడలో ఆగవని సమీపంలోని రాయనపాడు స్టేషన్‌లో ఆగుతాయన్నారు.

Similar News

News July 8, 2025

నేరాలు జరగకుండా పటిష్ఠమైన నిఘా ఏర్పాటు చేయాలి: SP

image

ముందస్తు సమాచార వ్యవస్థను బలోపేతం చేసుకొని, రాత్రిపూట జరిగే దొంగతనాలు, చైన్ స్నాచింగ్ వంటి నేరాలు జరగకుండా పటిష్ఠ నిఘా ఏర్పాటు చేయాలని ఎస్పీ ఆర్.గంగాధర్ రావు అన్నారు. మంగళవారం మచిలీపట్నంలో సీసీఎస్ పోలీసులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఎస్పీ దిశా నిర్దేశం చేశారు. దొంగతనాలకు పాల్పడే వారి ఆటలకు చెక్ పెడుతూ, చైన్ స్నాచింగ్ వంటి నేరాలు చేసే వారిపై నిఘా ఉంచాలన్నారు.

News July 8, 2025

మచిలీపట్నంలో రూ.7.88 లక్షల జరిమాన

image

మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సోమవారం విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారులు విస్తృత దాడులు నిర్వహించారు. 34 బృందాలుగా ఏర్పడిన అధికారులు జరిపిన తనిఖీల్లో 230 సర్వీసులపై అదనపు లోడును గుర్తించి రూ.7.88 లక్షల మేర జరిమానా విధించారు. విద్యుత్ చౌర్యానికి పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని విజిలెన్స్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిహెచ్ వాసు హెచ్చరించారు.

News July 7, 2025

కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

☞ పామర్రులో దొంగల ముఠాను అరెస్ట్
☞కృష్ణా: అస్వస్థతకు గురైన వల్లభనేని వంశీ
☞ మచిలీపట్నం: స్పందనలో అర్జీలు స్వీకరించిన అధికారులు
☞ ఆత్కూర్ స్వర్ణభారత్ ట్రస్ట్‌ను సందర్శించిన కలెక్టర్, ఎస్పీ
☞నూజివీడు: IIITలో 141 సీట్లు ఖాళీ
☞ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద ఆందోళన