News February 26, 2026
ALERT: కాజీపేటలో కల్తీ ఐస్‌క్రీం స్వాధీనం

కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని విష్ణుపురిలో టాస్క్ ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో కల్తీ ఐస్‌క్రీంలతో పాటు గడువు తీరిన రూ.60,400 విలువలైన 12 రకాల ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు పాటించని షాపు యజమానిని అదుపులోకి తీసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ ACP మధుసూదన్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న సామగ్రిని విచారణ నిమిత్తం ఫుడ్ సేఫ్టీ అధికారులకు అప్పగించారు.
Similar News
News February 26, 2026
HYD: విద్యార్థులకు టెలి మనస్ సేవలు

TGBIE ఆధ్వర్యంలో విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. పరీక్షల్లో ఒత్తిడి, భయం, నిరుత్సాహాన్ని ఎదుర్కొనే విద్యార్థులు మౌనం వహించకుండా తమ సమస్యలను పంచుకోవాలని సూచించారు. అవసరమైనప్పుడు నిపుణుల సహాయం పొందడం తప్పు కాదని పేర్కొన్నారు. మానసిక సహాయం కోసం టెలీ మానస్ హెల్ప్‌లైన్ 14416లో సంప్రదించాలని BIE ఎగ్జామినేషన్ కంట్రోలర్ జయప్రదాభాయ్ వెల్లడించారు.
News February 26, 2026
HYD: ఇంటర్ విద్యార్థుల కోసం హెల్ప్‌లైన్

TGBIE ప్రత్యేకంగా స్టూడెంట్స్ & పేరెంట్స్ హెల్ప్‌లైన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. పరీక్షలు, హాల్ టికెట్లు, ఫలితాలు తదితర అంశాలపై మార్గదర్శనం, సందేహాల నివృత్తికి సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు ఎగ్జామినేషన్ కంట్రోలర్ జయప్రదాభాయ్ తెలిపారు. హెల్ప్‌లైన్ నం. 040-24655027, IVR. No. 9240205555కు కాల్ చేసి విద్యార్థులు తమ సమస్యలకు పరిష్కారం పొందవచ్చు. అవసరమైన సహాయం కోసం వెంటనే సంప్రదించాలని సూచించారు.
News February 26, 2026
KNR: పట్టు కోల్పోతున్న ‘హస్తం’.. ఉమ్మడి జిల్లాకు పాకుతుందా?

KNR జిల్లాలో పార్టీ పట్టు సడలడంపై కాంగ్రెస్ అధిష్ఠానం అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జిల్లా నేతల తీరుపై చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. KNR అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ వెలిచాల రాజేందర్‌రావు నేతృత్వంలో పార్టీ ఓటమి పాలవ్వడంతో జిల్లా కేంద్రంలో పట్టు కోల్పోతే భవిష్యత్తులో ఆ ప్రభావం ఉమ్మడి జిల్లాపై పడుతుందని స్థానికంగా చర్చ నడుస్తోంది.


