News August 28, 2024
ALERT: బీ.ఎడ్ రెగ్యులర్ రెండవ సెమిస్టర్ పరీక్షల ఫీజు తేదీలు ఇవే

తెలంగాణ విశ్వ విద్యాలయ పరిధిలో బీ.ఎడ్. రెగ్యులర్ రెండవ సెమిస్టర్ పరీక్షల ఫీజు వివరాలను పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య. ఎం. అరుణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫీజును సెప్టెంబర్ 4వ తేది లోపు చెల్లించాలని, 100 రూపాయల అపరాధ రుసుముతో వరకు చెల్లించ వచ్చునని చెప్పారు. పూర్తి వివరాలు విశ్వ విద్యాలయ వెబ్ సైట్ ను చూడాలని ఆమె కోరారు.
Similar News
News December 30, 2025
BREAKING: నిజామాబాద్ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి బదిలీ

నిజామాబాద్ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ కృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనను GHMC అడిషనల్ కమిషనర్ (మల్కాజ్‌గిరి, ఎల్బీనగర్, ఉప్పల్ జోన్స్)గా నియమించారు. ఇక నిజామాబాద్ కలెక్టర్‌గా 2017 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి ప్రస్తుత నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి రానున్నారు.
News December 30, 2025
ఆర్మూర్: మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలి: కలెక్టర్

మున్సిపల్ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేలా అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయాన్ని కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై కమిషనర్ ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. జనవరి 10వ తేదీన తుది ఓటరు జాబితా వెలువరించాలని సూచించారు. ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ శైలజ తదితరులు పాల్గొన్నారు.
News December 30, 2025
హైదరాబాద్‌పై నిజామాబాద్ గెలుపు

కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ T-20 క్రికెట్ లీగ్ టోర్నీలో NZB జట్టు HYDపై 39 పరుగుల తేడాతో గెలుపొందింది. HYDలోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన NZB జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన HYD జట్టు 9 వికెట్లను కోల్పోయి 144 పరుగులు చేసింది. దీంతో NZB జట్టు 39 పరుగుల తేడాతో గెలుపొందింది.


