News May 20, 2024
ALERT: రూ.2000 అపరాధ రుసుంతో రేపటి వరకు ఛాన్స్ !
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈనెల 24 నుంచి ప్రారంభమయ్యే సప్లమెంటరీ పరీక్షల కోసం ఫీజు చెల్లించేందుకు ఇంటర్ బోర్డ్ మరో అవకాశాన్ని కల్పించింది. రూ.2000 అపరాధ రుసుంతో రేపటి వరకు ఫీజు చెల్లించవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. ఎవరైనా ఫీజు చెల్లించని విద్యార్థులు ఉంటే వారి అవకాశాన్ని వినియోగించుకోవాలని ఉమ్మడి జిల్లాలో ఇంటర్ అధికారులు పేర్కొంటున్నారు.
Similar News
News December 26, 2024
NGKL ఎంపీని కలిసిన పీయూ ఉపకులపతి
హైదరాబాదులోని NGKL ఎంపీ డాక్టర్ మల్లు రవి నివాసంలో గురువారం పాలమూరు పీయూ ఉపకులపతి శ్రీనివాస్ కలిసి పీజీ సెంటర్ స్థాపన గురించి వినతి పత్రం అందజేశారు. యూనివర్సిటీలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఎంపీతో చర్చించారు. సానుకూలంగా స్పందిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అనుమతులు వచ్చే విధంగా చూస్తానని స్పష్టమైన హామీ ఇచ్చారు.
News December 26, 2024
క్రిస్మస్ వేడుకలతో దద్దరిల్లిన మహబూబ్నగర్
క్రిస్మస్ వేడుకలతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా దద్దరిల్లింది. నగరంతో పాటు.. జిల్లాలోని పలు చర్చిల్లో పాస్టర్లు ప్రార్థనలు చేసి ఏసుక్రీస్తు చూపిన మార్గంలో అంతా నడవాలని సూచించారు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని జీసస్ పాటలు పాడుతూ సంబరాలు జరుపుకున్నారు. చర్చ్లతో పాటు.. నగరం అంతా దీపాల వెలుగులతో నింపేశారు. కాగా, క్రిస్మస్ మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి.
News December 26, 2024
MBNR: నేడు జిల్లాకు కేంద్రమంత్రి రాక
నర్వ మండలం రాయి కోడ్ గ్రామానికి, గురువారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బండి సంజయ్ వస్తున్నట్లు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు. నీతి అయోగ్ కార్యక్రమంలో పాల్గొంటారని, ఈ కార్యక్రమానికి మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ కూడా రానున్నట్లు ఆయన తెలిపారు. నర్వ మండల, గ్రామాల బీజేపీ నేతలు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని కోరారు.