News February 23, 2025

ALERT.. వేలేరు పరీక్షా కేంద్రం- 254302

image

వేలేరు గురుకుల పాఠశాలలో ఆదివారం నిర్వహిస్తున్న టీజీ సెట్ 2025 ప్రవేశ పరీక్షకు అభ్యర్థులు సకాలంలో హాజరుకావాలని బాలుర గురుకుల పాఠశాల&కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అజయ్ కుమార్ రౌతు ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లో పాఠశాల పేరు ఇవ్వకుండా సెంటర్ నెం-254302 మాత్రమే ప్రచురించిన విషయాన్ని అభ్యర్థులు గుర్తించాలని కోరారు. 11 గంటలకు జరిగే ప్రవేశ పరీక్షకు ఒక గంట ముందుగానే హాజరుకావాలన్నారు.

Similar News

News July 9, 2025

సికింద్రాబాద్ కంటోన్మెంట్‌కు మహర్దశ

image

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతానికి మహర్దశ పట్టనుంది. రూ.160 కోట్లతో రెండు స్ట్రోం వాటర్ డ్రైన్లు, ఒకటి జూబ్లీ నుంచి ప్యాట్నీ వరకు, రెండోది రసూల్‌పూర బస్తీల మీదుగా మంజూరైంది. SNDP మాదిరిగా వీటిని నిర్మించనున్నారు. దీనితో కంటోన్మెంట్, బోయినపల్లికి వరద ముంపు నుంచి శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉంది. రూ.128 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అభివృద్ధి చేయనున్నారు.

News July 9, 2025

ASF: ఉప్పొంగిన ప్రాణహిత

image

కౌటాల మండలంలోని తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎగువన కురిసిన వర్షాలతో పెన్‌గంగా, వార్ధా, ప్రాణహిత నదులు ఒక్కచోట చేరి తుమ్మిడిహెట్టి వద్ద పుష్కర ఘాట్లను తాకాయి. నదీ ప్రవాహం ఉద్ధృతంగా ఉన్నందువల్ల సమీప గ్రామ ప్రజలు నదిలోకి వెళ్లొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

News July 9, 2025

HYD: క‌ల్లు డిపోల లైసెన్స్ ర‌ద్దు చేస్తాం: మంత్రి

image

HYDలో కల్తీ కల్లు ఘటనపై మంత్రి జూపల్లి కృష్ణారావు Xలో ట్వీట్ చేశారు. ‘ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడితే ఎంతటి వారినైనా వదలం. కల్లు శాంపిల్ టెస్టింగ్ కోసం ఫోరెన్సిక్ పంపాం. నివేదిక ఆధారంగా బాధ్యులపై క్రిమిన‌ల్ చ‌ర్య‌లు తీసుకోవ‌డంతో పాటు, క‌ల్లు డిపోల లైసెన్స్ ర‌ద్దు చేస్తాం. భ‌విష్య‌త్లో ఇలాంటి ఘ‌ట‌న‌లు పునరావృతం కాకుండా క‌ట్టుదిట్ట‌మైన‌ చ‌ర్య‌లు తీసుకుంటాం’ అని రాసుకొచ్చారు.