News September 4, 2024
ALERT: భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండండి

TG: హైదరాబాద్ వ్యాప్తంగా నేటి నుంచి 9వ తేదీ వరకూ భారీ వర్షాలు కురవనున్నాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని GHMC హెచ్చరించింది. ‘వరద ప్రవాహం అధికంగా ఉండటంతో వాగులు, నదుల వద్దకు వెళ్లకండి. నీరు నిలిచి ఉన్న చోట రోడ్లపై మ్యాన్‌హోల్స్‌ను చూసుకోండి. ఎవరూ మ్యాన్‌హోల్ తెరవద్దు. ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలను తాకొద్దు. వాహనాలను వేగంగా నడపొద్దు. ఎమర్జెన్సీలో 040-21111111కి కాల్ చేయండి’ అని తెలిపింది.
Similar News
News October 17, 2025
TET, DSC అర్హతలు, ఇతర నిబంధనల్లో మార్పు!

AP: 2వేల టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయించడంతో విద్యాశాఖ ఆ దిశగా కసరత్తు చేపట్టింది. DECలో టెట్, ఆపై JANలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని ఆలోచిస్తోంది. ప్రతీసారి వీటికి లీగల్ ఇష్యూస్ వస్తుండడంతో వాటిపై దృష్టి పెట్టారు. నిపుణులతో చర్చించి అర్హతలు ఇతర నిబంధనల్లో మార్పులు చేయాలని భావిస్తున్నారు. ఇటీవలి DSCలో 16317 పోస్టుల్లో 15941 భర్తీ అయ్యాయి. మిగిలిన వాటితో పాటు ఇతర ఖాళీలు భర్తీ చేస్తారు.
News October 17, 2025
దీపావళి 5 రోజుల పండుగ అని మీకు తెలుసా?

దీపావళిని మనం రెండ్రోజులే జరుపుకొంటాం. కానీ ఉత్తర భారత్‌లో ఆశ్వయుజ బహుళ త్రయోదశి నుంచి కార్తీక శుద్ధ ద్వితీయ వరకు.. మొత్తం 5 రోజుల పాటు వేడుకలు నిర్వహిస్తారు. త్రయోదశి నాడు ధన్‌తేరస్‌గా కొత్త వస్తువులు కొనడం శుభప్రదంగా భావిస్తారు. 14వ తిథిన నరక చతుర్ధశి, అమావాస్య రోజు దీపావళి జరుపుకొంటారు. పాడ్యమి రోజున గోవర్ధన పూజ చేసి, బలి చక్రవర్తిని పూజిస్తారు. ద్వితీయ తిథిన భాయ్ దూజ్ వేడుకలుంటాయి.
News October 17, 2025
తుపాకీ వదిలిన ఆశన్న

మావోయిస్టు పార్టీలో మరో శకానికి తెరపడింది. అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ 2రోజుల కింద లొంగిపోగా ఇవాళ ఇంకో టాప్ కమాండర్ ఆశన్న(తక్కళ్లపల్లి వాసుదేవరావు) సరెండర్ అయ్యారు. 25ఏళ్లుగా ఆయన ఎన్నో దాడులకు వ్యూహకర్తగా పనిచేశారు. AP CM చంద్రబాబు, మాజీ CM నేదురుమల్లి జనార్దన్‌రెడ్డిపై బాంబు దాడితో హత్యాయత్నం, 1999లో IPS ఉమేశ్‌చంద్ర, 2000లో నాటి హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి హత్యలకు నేతృత్వం వహించినట్లు ప్రచారం.