News April 6, 2025
APలో ఎండ తీవ్రత పెరిగే అవకాశం

AP వ్యాప్తంగా క్రమంగా ఎండతీవ్రత పెరగనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. కొన్నిచోట్ల అకస్మాత్తుగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోమవారం(07-04-25) రాయలసీమలో 40-42°C, ఉత్తరాంధ్రలో 39-41°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్సుందన్నారు. ఎండదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలన్నారు.
Similar News
News November 21, 2025
రెండో టెస్టుకు గిల్ దూరం.. ముంబైకి పయనం

మెడనొప్పితో బాధపడుతున్న టీమ్ఇండియా టెస్ట్ కెప్టెన్ గిల్ సౌతాఫ్రికాతో జరగాల్సిన రెండో టెస్టుకు దూరమయ్యారు. ICUలో చికిత్స పొంది జట్టుతో పాటు గువాహటికి చేరుకున్న ఆయనకు ఇవాళ ఫిట్‌నెస్ టెస్ట్ నిర్వహించారు. అందులో ఫెయిల్ కావడంతో జట్టు నుంచి రిలీజ్ చేశారు. కొద్దిసేపటి కిందటే గిల్ ముంబైకి పయనమయ్యారు. అక్కడ వైద్య నిపుణుల పర్యవేక్షణలో 3 రోజులు చికిత్స తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
News November 21, 2025
వంటగది చిట్కాలు

* చపాతీ పిండిలో టేబుల్ స్పూన్ పాలు, బియ్యప్పిండి, నూనె వేసి ఐస్ వాటర్‌తో కలిపితే చపాతీలు మెత్తగా వస్తాయి.
* పల్లీలు వేయించేటప్పుడు 2 స్పూన్ల నీరు పోసివేయిస్తే తొందరగా వేగడంతో పాటు పొట్టు కూడా సులువుగా పోతుంది.
* కొత్త చీపురుని దువ్వెనతో శుభ్రం చేస్తే అందులో ఉండే దుమ్ము పోతుంది.
* వెల్లుల్లికి వైట్ వెనిగర్ రాస్తే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.
* పాలను కాచిన తర్వాత ఎండ, వేడి పడని చోట పెట్టాలి.
News November 21, 2025
ఈ నెల 26న కోనసీమ జిల్లాలో పవన్ పర్యటన

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నెల 26న కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. కేశనపల్లిలో కొబ్బరిచెట్లను ఆయన పరిశీలించనున్నారు. దీంతో పాటు 15గ్రామాల రైతులను పరామర్శించనున్నట్లు జనసేన వర్గాలు తెలిపాయి. అనంతరం ఆయన పల్లెపండుగ 2.0 కార్యక్రమంలో పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారని పేర్కొన్నాయి. ఇటీవల మొంథా తుఫాను ప్రభావంతో కోనసీమలోని కొబ్బరి రైతులు నష్టపోయిన విషయం తెలిసిందే.


