News April 13, 2025
ALERT.. రేపు జాగ్రత్త

AP: రేపు కోనసీమ జిల్లాలోని 7 మండలాలు, కాకినాడలో 3, తూర్పు గోదావరిలో ఒక మండలంలో తీవ్ర వడగాలులు వీస్తాయని, మరో 98 మండలాల్లో <
Similar News
News April 15, 2025
అట్లీ-అల్లు అర్జున్ మూవీలో ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్లు?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్లో తెరకెక్కనున్న మూవీపై ఓ క్రేజీ రూమర్ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో బన్ని సరసన ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్లు నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో ఒక హీరోయిన్గా జాన్వీ కపూర్ పేరు ఖరారైందని, మరో హీరోయిన్గా దిశా పటానీని తీసుకుంటారని సమాచారం. కాగా ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ దాదాపు రూ.800 కోట్లతో తెరకెక్కించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
News April 15, 2025
SC వర్గీకరణపై 5 రోజుల్లో ఆర్డినెన్స్.. ఆ వెంటనే DSC?

AP: జాతీయ SC కమిషన్ నుంచి వర్గీకరణ డాక్యుమెంట్ రాష్ట్ర ప్రభుత్వానికి చేరింది. దీనిపై ఇవాళ మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. 5 రోజుల్లో ఆర్డినెన్స్ విడుదల చేసి, ఆ తర్వాత 3 రోజుల్లో మార్గదర్శకాలను వెల్లడించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వచ్చే వారంలో విద్యాశాఖ మెగా DSC నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశముంది. జూన్ నాటికి 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని CM CBN ప్రకటించిన విషయం తెలిసిందే.
News April 15, 2025
త్రివిక్రమ్తో వెంకటేశ్ మూవీ ఫిక్స్?

వెంకటేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ మూవీ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఫ్యామిలీ డ్రామా సబ్జెక్ట్తో తెరకెక్కబోయే ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుందని సమాచారం. కాగా అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ అట్లీ ప్రాజెక్ట్ వల్ల ఈ సినిమా ఆగిపోయింది. అట్లీ-బన్నీ మూవీ పూర్తయ్యేందుకు దాదాపు ఏడాదికిపైగా పడుతుంది. ఈ గ్యాప్లో వెంకీతో త్రివిక్రమ్ సినిమా కంప్లీట్ చేసే ఛాన్సుంది.