News July 27, 2024

ALERT: నొరో వైరస్‌తో జాగ్రత్త.. లక్షణాలివే!

image

వర్షాకాలంలో ఎక్కువగా నొరో వైరస్ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉందని GHMC హెచ్చరించింది. ఈక్రమంలో ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. కలుషిత నీరు, ఆహారం కారణంగా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. చలిజ్వరం, వాంతులు, విరేచనాలు, నీరసం, కడుపు నొప్పి, డీహైడ్రేషన్ వంటివి ఈ వ్యాధి లక్షణాలు. చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోండి. కాచి చల్లార్చి వడపోసిన నీటినే తాగండి. ఇంటిని, పరిసరాలను శుభ్రం చేసుకోవాలని సూచించింది.

Similar News

News November 16, 2025

శుభ సమయం (16-11-2025) ఆదివారం

image

✒ తిథి: బహుళ ద్వాదశి తె.5.09 వరకు ✒ నక్షత్రం: హస్త రా.3.26 వరకు ✒ శుభ సమయాలు: ఏమీ లేవు. ✒ రాహుకాలం: సా.4.30-6.00 వరకు ✒ యమగండం: మ.12.00-1.30 ✒ దుర్ముహూర్తం: సా.4.25-5.13, ✒ వర్జ్యం: ఉ.10.49-మ.12.30 ✒ అమృత ఘడియలు: రా.9.01-10.51

News November 16, 2025

ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు

image

*17 నెలల్లో రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు: సీఎం చంద్రబాబు
*విశాఖ స్టీల్ ప్లాంటును తెల్ల ఏనుగుతో పోల్చిన చంద్రబాబు
*ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసిన సీఎం రేవంత్, MLA నవీన్ యాదవ్
*హిందూపురంలో మా కార్యాలయంపై టీడీపీ దాడి చేసింది: వైఎస్ జగన్
*రాజమౌళి-మహేశ్ బాబు సినిమా టైటిల్‌ ‘వారణాసి’.. ఆకట్టుకుంటున్న గ్లింప్స్
*సౌతాఫ్రికాతో టెస్టు.. విజయానికి చేరువలో భారత్

News November 16, 2025

పాకిస్థాన్ నుంచి డ్రోన్లతో బాంబులు, డ్రగ్స్ సరఫరా

image

పాక్ నుంచి డ్రోన్ల ద్వారా పేలుడు పదార్థాలు, ఆయుధాలు, డ్రగ్స్‌ సరఫరా చైన్‌ను NIA రట్టు చేసింది. ప్రధాన వ్యక్తి విశాల్ ప్రచార్‌ అరెస్టు చేసి తాజాగా ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. పాక్ బార్డర్లలో డ్రోన్ల ద్వారా వచ్చే ఆర్మ్స్, డ్రగ్స్, అమ్మోనియం వంటి వాటిని గ్యాంగుల ద్వారా పంజాబ్, హరియాణా, రాజస్థాన్‌కు చేరవేస్తున్నారని పేర్కొంది. సామాజిక అస్థిరత సృష్టించేలా ఈ గ్యాంగులు పనిచేస్తున్నాయని NIA వివరించింది.