News March 19, 2024

ALERT: ఈ మెసేజ్‌తో జాగ్రత్త

image

లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా BJP ‘వికసిత్‌ భారత్‌ సంపర్క్’ పేరుతో వాట్సాప్‌ మెసేజ్‌లు పంపుతోంది. మోదీ ప్రభుత్వ పని తీరు ఎలా ఉందో ఫీడ్‌బ్యాక్‌తో పాటు సలహాలు ఇవ్వాలని అడుగుతోంది. అయితే ఈ మెసేజ్ పేరుతోనే సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశముంది. వికసిత్‌ భారత్‌ మెసేజ్ 9275536906, 9275536919 నంబర్లతో మాత్రమే వస్తుంది. ఇతర నంబర్లతో వస్తే అది ఫేక్ అని, రిప్లై ఇవ్వొద్దని పలువురు సూచిస్తున్నారు.

Similar News

News January 7, 2025

కాంగ్రెస్ మోసంపై నిరసనలు ఢిల్లీకి చేరాయి: కేటీఆర్

image

TG: కాంగ్రెస్ అంటేనే కన్నింగ్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రైతు భరోసాపై కాంగ్రెస్ ప్రభుత్వం యూ టర్న్ తీసుకోవడంపై ఢిల్లీలోని ఏఐసీసీ ఆఫీసు వద్ద పోస్టర్లు వెలిశాయని తెలిపారు. ‘రైతు డిక్లరేషన్’ ఎలా అమలవుతుందో రాష్ట్రానికి వచ్చి వివరించవచ్చు కదా అని రాహుల్ గాంధీని ప్రశ్నించారు. ‘అబద్ధాల కాంగ్రెస్‌లో అన్ని అరకొర గ్యారంటీలు, అర్ధ సత్యాలే’ అని ట్వీట్ చేశారు.

News January 7, 2025

వెండి నగలకూ హాల్ మార్కింగ్!

image

బంగారం ఆభరణాల మాదిరే వెండి నగలకూ హాల్‌మార్క్ తప్పనిసరి చేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ ప్రతిపాదనను పరిశీలించాలని BISను కోరినట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. అమలు సాధ్యాసాధ్యాలు, వినియోగదారులు, డీలర్ల స్పందనలను తెలుసుకోవాలని కోరినట్లు చెప్పారు. అవసరమైన చర్చల తర్వాతే ప్రక్రియ మొదలుపెడతామన్నారు. అటు 3-6 నెలల్లో ఈ విధానం అమలుకు సిద్ధంగా ఉన్నట్లు BIS డైరెక్టర్ ప్రమోద్ కుమార్ చెప్పారు.

News January 7, 2025

కాసేపట్లో కిమ్స్‌ ఆస్పత్రికి అల్లు అర్జున్‌

image

సంధ్య థియేటర్‌ ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు అల్లు అర్జున్‌ హైదరాబాద్ బేగంపేట్‌లోని కిమ్స్ ఆస్పత్రికి బయల్దేరారు. తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ 35 రోజులుగా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. పోలీసుల అనుమతితో బాలుడిని పరామర్శించేందుకు బన్నీ వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో కిమ్స్‌ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.