News December 12, 2024
ALERT.. ఈ జిల్లాల్లో చలిగాలులు

తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సాధారణం కంటే 2-4 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో చలిగాలులు వీచే అవకాశముందని హెచ్చరించింది.
Similar News
News January 7, 2026
బీరు తాగితే కిడ్నీలో రాళ్లు కరుగుతాయా? క్లారిటీ

బీరు తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయనేది అపోహ మాత్రమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కిడ్నీలో రాళ్లు ఉన్నవాళ్లు శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి. నీరు ఎక్కువగా తాగాలి. బీరు తాగితే బాడీ డీహైడ్రేట్ అవుతుంది. కిడ్నీలు ఒత్తిడికి గురై రాళ్లు పెరిగే ప్రమాదం ఉంటుంది. బీరులోని ప్యూరిన్తో యూరిక్ యాసిడ్ పెరిగి కొత్త రాళ్లు ఏర్పడవచ్చు. మూత్రంలో ప్రెజర్ పెరిగి రాయి బ్లాడర్లో ఇరుక్కునే ప్రమాదం ఉంది.
News January 7, 2026
జీరో టిల్లేజ్ పొద్దుతిరుగుడు సాగు – కలుపు నివారణ

జీరో టిల్లేజ్ పొద్దుతిరుగుడు సాగులో కలుపు నివారణకు మొదటి 20- 25 రోజులు కీలక దశ. వరికొయ్యలపై పొద్దుతిరుగుడు విత్తిన రోజు ముందుగా లీటరు నీటికి పారక్వాట్ కలుపు మందు 5mlను కలిపి పిచికారీ చేయాలి. విత్తిన 24-48 గంటలలోపు తేమ గల నేలపై పెండిమిథాలిన్ కలుపు మందును లీటరు నీటికి 5 మి.లీ. కలిపి పిచికారీ చేయాలి. పంట 25-30 రోజుల దశలో లీటరు నీటికి క్విజాలోఫోప్ ఈథైల్ 2 మి.లీ. చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
News January 7, 2026
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. ఒకే ఓవర్లో 4,6,4,6

సౌతాఫ్రికా U-19తో మూడో వన్డేలో భారత విధ్వంసకర ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ రెచ్చిపోయారు. 7వ ఓవర్లో వరుసగా 4,6,4,6 బౌండరీలు బాదారు. ఈక్రమంలోనే అతడు 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశారు. ప్రస్తుతం వైభవ్(56)తో పాటు ఆరోన్ జార్జ్(51) క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ 10 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 111 రన్స్ జోడించారు.


