News July 31, 2024
ALERT: మరణాల్లో కరెంట్ ‘షాక్’
దేశంలో కరెంట్ షాక్ వల్ల నమోదవుతున్న మరణాలపై NCRB(నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో) షాకింగ్ వివరాలు వెల్లడించింది. ఈ రిపోర్టు ప్రకారం 2015-2020 మధ్య ఏకంగా 72,000 మంది కరెంట్ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయారు. అంటే ఏడాదికి సగటున 12,000 మంది, డైలీ 32 మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నమాట. ఇటీవల UPలో ఓ UPSC అభ్యర్థి హాస్టల్ వద్ద వర్షపు నీటిలో కరెంట్‌షాక్‌కు గురై మరణించిన ఘటన అందర్నీ కలచివేసింది.
Similar News
News February 2, 2025
RC16లో ఓ సీక్వెన్స్‌కు నెగటివ్ రీల్: రత్నవేలు
బుచ్చిబాబు డైరెక్షన్లో రామ్ చరణ్, జాన్వీ జంటగా నటిస్తున్న RC16 మూవీపై సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఆసక్తికర విషయం వెల్లడించారు. ఇందులో ఓ సీక్వెన్స్‌లో సహజత్వం కోసం నెగటివ్ రీల్ ఉపయోగించనున్నట్లు తెలిపారు. కొన్నేళ్లుగా అంతా డిజిటల్ అయిందని, అయితే హాలీవుడ్లో నెగటివ్ వాడుతున్నారని చెప్పారు. ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారమన్నారు. గ్రామీణ స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే.
News February 2, 2025
ఎయిర్ ఇండియాకు రూ.30 లక్షల పెనాల్టీ
రెగ్యులేటరీ నిబంధనలను పాటించని ఓ పైలట్‌ను విమానాన్ని నడిపేందుకు అనుమతించిన ఎయిర్ ఇండియాపై డీజీసీఏ కొరడా ఝళిపించింది. రూ.30 లక్షలు పెనాల్టీ విధించింది. గత ఏడాది జులై 7న ఆ పైలట్ నిబంధనలు ఉల్లంఘించి 3 విమానాలను టేకాఫ్, ల్యాండింగ్ చేశాడని పేర్కొంది. డిసెంబర్ 13న జారీ చేసిన షోకాజ్ నోటీసులకు ఎయిర్ ఇండియా ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో ఫైన్ వేసినట్లు తెలిపింది.
News February 2, 2025
టెన్త్ విద్యార్థులకు ‘స్నాక్స్’ ప్రారంభం
TG: ప్రభుత్వ, మోడల్ స్కూళ్లలో చదువుతున్న టెన్త్ విద్యార్థులకు ఈవెనింగ్ స్నాక్స్ అందించే కార్యక్రమం నిన్న ప్రారంభమైంది. మార్చి 20వ తేదీ వరకు దీనిని ప్రభుత్వం అమలు చేయనుంది. ఉడకబెట్టిన పెసర్లు, పల్లీలు, బెల్లం, మిల్లెట్ బిస్కెట్లు, ఉడకబెట్టిన బొబ్బర్లు, శనగలు, ఉల్లిపాయ పకోడి రోజుకొక రకం ఇవ్వనున్నారు. స్పెషల్ క్లాసులకు హాజరయ్యే విద్యార్థులు ఆకలితో అలమటించకుండా ఉండేందుకు స్నాక్స్ అందిస్తున్నారు.