News April 2, 2024
ALERT: సైబర్ నేరగాళ్ల కొత్త ఎత్తుగడ

AIను వినియోగించి వాయిస్ మార్చేసి మోసాలకు పాల్పడుతున్న ఘటనలపై TSRTC ఎండీ సజ్జనార్ అవగాహన కల్పిస్తున్నారు. బెంగళూరులో ఫోన్ చేసి బంధువుల వాయిస్ని ఏఐతో ఇమిటేట్ చేసి సైబర్ నేరగాళ్లు మోసాలు చేస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి మోసాల వలలో చిక్కుకోవద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్లోనూ ఇలాంటి మోసాలు జరుగుతున్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Similar News
News October 26, 2025
RTC, ప్రైవేట్ బస్సులకు తేడా ఏంటి?

ఆర్టీసీలో ట్రైనింగ్ తీసుకున్న డ్రైవర్లు ఉంటారు. డ్యూటీకి ముందు ప్రతి డిపోలో ఆల్కహాల్ టెస్టు చేస్తారు కాబట్టి మద్యం తాగి బస్సు నడిపే అవకాశం ఉండదు. బస్సుకు స్పీడ్ లాక్ ఉండటంతో గంటకు 80 కి.మీ. వేగాన్ని దాటి వెళ్లలేదు. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ప్రైవేట్ బస్సు డ్రైవర్లు రాత్రి వేళ్లలో గంటకు 120 కి.మీ. వేగంతో వెళ్తారు. డ్రైవింగ్ చేసేటప్పుడు మద్యం తాగే అవకాశమూ ఉంది.
News October 26, 2025
DRDOలో ఇంటర్న్షిప్ చేయాలనుకుంటున్నారా?

<
News October 26, 2025
నల్లరంగు వల్ల బైకును గుర్తించలేకపోయా: డ్రైవర్

AP: రోడ్డుపై పడిన <<18102090>>బైక్<<>> నల్లరంగులో ఉండటంతో దూరం నుంచి సరిగా గుర్తించలేకపోయానని వేమూరి కావేరి బస్సు డ్రైవర్ లక్ష్మయ్య పోలీసులకు చెప్పాడు. వర్షంలో సడెన్ బ్రేక్ వేస్తే ప్రమాదం జరుగుతుందనే ఉద్దేశంతో ఆపకుండా బైకుపై నుంచి బస్సును పోనిచ్చినట్లు తెలిపాడు. కాగా ఈ ప్రమాదానికి ముందు 3 బస్సులు ఆ బైకును గుర్తించి పక్క నుంచి వెళ్లినట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లే.


