News July 6, 2024

ALERT: HDFC నుంచి ఈ మెసేజ్ వచ్చిందా?

image

బ్యాంకింగ్ అనుభవాన్ని మెరుగుపరిచేందుకు ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ HDFC సిస్టమ్ అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు యూజర్లకు మెసేజ్‌లు పంపుతోంది. ఈనెల 13వ తేదీన ఉదయం 3 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు సిస్టమ్ అప్‌గ్రేడ్ జరగనుంది. ఈ సమయంలో ATM & DEBIT CARDS మాత్రమే పనిచేస్తాయి. మూడున్నర గంటలు (9:30AM – 12:45PM) UPI పనిచేయదు. నెట్ & మొబైల్ బ్యాంకింగ్ సేవలు పాక్షికంగా అందుబాటులో ఉంటాయి.

Similar News

News March 23, 2026

DANGER: ఈ పాస్‌వర్డ్స్ పెట్టుకుంటున్నారా?

image

హ్యాకర్లకు చిక్కకూడదంటే స్ట్రాంగ్ పాస్‌వర్డ్ పెట్టుకోవడం ఎంతో ముఖ్యం. ఈ నేపథ్యంలో కేంద్రం పలు సూచనలు చేసింది. ‘12-16 అక్షరాల పాస్‌వర్డ్‌లో A-Z, a-z, 0-9, స్పెషల్ క్యారెక్టర్స్ (@, #, $, &) ఉండేలా చూసుకోండి. మీ పేరు, పుట్టిన తేదీ లేదా ఫోన్ నంబర్లు వాడకండి. 123456 లేదా password వంటివి అస్సలు వద్దు. ప్రతి అకౌంట్‌కు వేర్వేరు పాస్‌వర్డ్స్ వాడుతూ కాలానుగుణంగా వాటిని మారుస్తూ ఉండండి’ అని సూచించింది.

News March 23, 2026

ఆర్థిక శాఖ కార్యదర్శిపై హైకోర్టు ఆగ్రహం

image

TG: ఆర్థిక శాఖ కార్యదర్శిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించకపోవడంతో 6 నెలల క్రితం ధిక్కరణ నోటీసులిచ్చింది. ఈరోజు కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలివ్వగా రాలేదు. అసెంబ్లీ సమావేశాలున్నందున రాలేదని AG కోర్టుకు తెలిపారు. అయితే ముందే అనుమతి తీసుకోవాలి కదా? అని జడ్జి వ్యాఖ్యానించారు. వ్యక్తిగత హాజరును మినహాయించేది లేదని, రాత్రివరకు కోర్టులోనే ఉంటామని స్పష్టం చేశారు.

News March 23, 2026

మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ముగ్గురికి పోలీస్ కస్టడీ

image

TG: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ముగ్గురు నిందితులను పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ రాజేంద్రనగర్ కోర్టు తీర్పునిచ్చింది. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు రితేశ్ రెడ్డి, నమిత్ శర్మను మూడు రోజుల పాటు కస్టడీకి అనుమతినిచ్చింది. ఇవాళ సా.4:30 గంటల నుంచి మార్చి 26 సా.4:30 గంటల వరకు కస్టడీకి అనుమతించింది. విచారణను ఉ.6 గంటల తర్వాత మాత్రమే నిర్వహించాలని, సా.7 గంటల తర్వాత చేయవద్దని కోర్టు ఆదేశించింది.