News April 1, 2024

ALERT: బయటకు రాకండి!

image

తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోయాయి. భానుడి ప్రతాపానికి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెల్సియస్‌ను దాటడంతో వేడిగాలులు వీస్తున్నట్లు పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. అవసరమైతే తప్ప బయటకు రాకపోవడమే మేలని సూచిస్తున్నారు. ఉప్పల్‌లో 43.3, శేరిలింగంపల్లిలో 43.1, కుత్బుల్లాపూర్‌లో 43.0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Similar News

News April 12, 2026

రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో 24 సార్లు డ్రగ్స్ పార్టీలు!

image

TG: మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో 24 సార్లు డ్రగ్స్ పార్టీలు జరిగినట్లు సిట్ అధికారులు గుర్తించారని తెలుస్తోంది. దుబాయ్‌లో డ్రగ్స్ పార్టీల్లో ఆయన పాల్గొన్నారని, పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరిపారని కనిపెట్టినట్లు సమాచారం. కస్టడీలో కీలక విషయాలను అధికారులు రాబట్టినట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసులో ఆయన అరెస్టు కావడం తెలిసిందే.

News April 12, 2026

ఇలాంటి వారితో స్నేహం చేయాలి!

image

నీచగుణములెల్ల నిర్మూలమైపోవు
కొదవలేదు సుజన గోష్ఠి వలన
గంధ మలద మేనికంపడగినయట్లు
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: సుగంధ భరితమైన చందనాన్ని పూసుకుంటే శరీరానికి ఉండే దుర్గంధం పోతుంది. అలాగే సజ్జనుల(మంచి వారు)తో మాట్లాడటం, స్నేహం చేయడం వల్ల మనలోని చెడు గుణాలన్నీ దూరమైపోతాయి.
<<-se>>#PADHYAM<<>>

News April 12, 2026

ఇరాన్, అమెరికా మధ్య ముగిసిన చర్చలు

image

పాక్ వేదికగా ఇరాన్, అమెరికా మధ్య శాంతి చర్చలు ముగిశాయి. 14 గంటలపాటు డిస్కషన్స్ కొనసాగినట్లు ఇరాన్ ప్రభుత్వం తెలిపింది. ‘నిపుణుల నివేదికలను ఇరుపక్షాల సాంకేతిక బృందాలు పరస్పరం మార్చుకున్నాయి. కొన్ని విభేదాలు మిగిలి ఉన్నప్పటికీ చర్చలు కొనసాగుతాయి’ అని ట్వీట్ చేసింది. అయితే ఏయే అంశాలపై చర్చించారు, వేటిపైన ఏకాభిప్రాయం కుదిరింది, ఇరాన్ కండిషన్లపై US స్పందనేంటనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.