News March 18, 2024

ALERT: మీలో ఈ లక్షణాలున్నాయా?

image

గ్లాకోమా.. కంటి జబ్బుల్లో అత్యంత ప్రమాదకరమని, కంటిచూపును క్షీణింపజేస్తూ చివరికి శాశ్వత అంధత్వాన్ని తీసుకొస్తుందని వైద్యులు చెబుతున్నారు. గ్లాకోమా సంకేతాలు, లక్షణాలు ఉంటే వెంటనే తొలి దశలోనే చికిత్స చేయించుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ సూచిస్తోంది. తీవ్రమైన తలనొప్పి, కళ్లు తరచూ ఎరుపు రంగులోకి మారడం, తరచూ కళ్లద్దాలు మార్చాల్సి రావడం, కంటి నొప్పి వంటివి లక్షణాలుంటే వైద్యులను సంప్రదించాలని కోరింది.

Similar News

News December 28, 2024

వాచ్‌మెన్‌కు జాక్‌పాట్.. లాటరీలో రూ.2.32కోట్లు

image

దుబాయ్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న HYDకు చెందిన రాజమల్లయ్య(60)కు జాక్‌పాట్ తగిలింది. ఇటీవల ప్రకటించిన బిగ్ టికెట్ మిలియనీర్ ఎలక్ట్రానిక్ లక్కీ డ్రాలో ఆయన మిలియన్ దిర్హామ్స్(రూ.2.32 కోట్లు) గెలుచుకున్నారు. దీంతో మల్లయ్య సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. తాను 30ఏళ్లుగా లాటరీ టికెట్ కొంటున్నానని, ఇప్పుడు అదృష్టం వరించిందని తెలిపారు. ఈ మొత్తాన్ని కుటుంబం, స్నేహితులతో పంచుకుంటానని తెలిపారు.

News December 28, 2024

దటీజ్ మన్మోహన్: ఆపరేషన్ తర్వాత తొలి ప్రశ్న.. ‘నా దేశం ఎలా ఉంది?’

image

మన్మోహన్ సింగ్‌ ప్రధానిగా ఉండగా 2009లో హార్ట్ సర్జరీ జరిగింది. 11 గంటల శస్త్రచికిత్స తర్వాత బ్రీతింగ్ పైప్ తీసేయగానే ఆయన తన ఆరోగ్యం గురించి కాకుండా దేశం ఎలా ఉంది? కశ్మీర్ ఎలా ఉంది? అని అడిగారు. తన ధ్యాసంతా సర్జరీపై కాకుండా దేశంపైనే ఉందని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని ఆయనకు సర్జరీ చేసిన డాక్టర్ రమాకాంత్ పాండా ఓ సందర్భంలో వెల్లడించారు. మన్మోహన్ మానసికంగా చాలా బలంగా ఉండేవారని తెలిపారు.

News December 28, 2024

దివ్యాంగులకు షాక్.. సదరం సర్టిఫికెట్ల జారీ నిలిపివేత

image

AP: సామాజిక పింఛన్ల తనిఖీ పూర్తయ్యే వరకు దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. దీంతో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న దివ్యాంగులకు నిరాశ ఎదురుకానుంది. పింఛన్‌దారులలో అనర్హులు ఉన్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. దీంతో జనవరి నుంచి మే వరకు పింఛన్ల తనిఖీ చేయనున్నట్లు సమాచారం. తొలుత రూ.15వేలు అందుకునే లబ్ధిదారులకు పరీక్షలు నిర్వహిస్తారట.