News July 19, 2024
ALERT: ఈగలే కదా అని లైట్ తీసుకోవద్దు!

వర్షాకాలంలో ఇంట్లోకి ఈగలు వస్తుంటాయి. వాటి శరీరం వ్యాధులను కలిగించే క్రిములకు నిలయమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈగలు వాలిన ఆహారం తింటే టైఫాయిడ్, కలరా వంటి వ్యాధులు వచ్చే ప్రమాదముందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈగ వేసే ప్రతి అడుగు బ్యాక్టీరియాను మనుషుల్లోకి బదిలీ చేయగలదని పరిశోధనల్లో తేలింది. ఈగలు రాకుండా పరిశుభ్రత పాటించడంతో పాటు ఇతర జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.
> SHATE
Similar News
News November 2, 2025
తుఫాను: రైతులను పరామర్శించనున్న జగన్

AP: మొంథా తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతులను తమ అధినేత జగన్ పరామర్శిస్తారని వైసీపీ తెలిపింది. ఈ నెల 4న కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం గూడూరులో దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారని పేర్కొంది. కాగా జగన్ ఇవాళ బెంగళూరు నుంచి తాడేపల్లిలోని తన నివాసానికి వచ్చారు.
News November 2, 2025
సచిన్‌తో లోకేశ్, బ్రాహ్మణి సెల్ఫీ

ICC ఛైర్మన్ జైషాతో మంత్రి నారా లోకేశ్ భేటీ అయ్యారు. తన భార్య బ్రాహ్మణితో పాటు వెళ్లి జైషా, ఆయన తల్లి సోనాలీ షాను కలిసినట్లు ట్వీట్ చేశారు. క్రికెట్, యువత భాగస్వామ్యం, దేశ క్రీడా భవిష్యత్తు గురించి చర్చించినట్లు పేర్కొన్నారు. నవీముంబైలో జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు లోకేశ్, బ్రాహ్మణి వెళ్లారు. టీమ్ఇండియా జెర్సీలు ధరించిన వారిద్దరూ సచిన్‌తో పాటు పలువురిని కలిశారు.
News November 2, 2025
FINAL: టీమ్ ఇండియాకు శుభారంభం

సౌతాఫ్రికాతో జరుగుతున్న ఉమెన్ వరల్డ్ కప్ ఫైనల్‌లో టీమ్ ఇండియా నిలకడగా ఆడుతోంది. 21 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 122 రన్స్ చేసింది. ఓపెనర్ స్మృతి 58 బంతుల్లో 45 రన్స్ చేసి ఔటయ్యారు. మరో ఓపెనర్ షెఫాలీ వర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం క్రీజులో షెఫాలీ (58*), జెమీమా రోడ్రిగ్స్ (9*) క్రీజులో ఉన్నారు.


