News June 10, 2024

ALERT: వర్షంలో వాహనాలు నడుపుతున్నారా?

image

వర్షాకాలం ప్రారంభమవడంతో వాహనదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తెలంగాణ డీజీపీ X వేదికగా అవగాహన కల్పిస్తున్నారు.
– వాహనాల టైర్ల గ్రిప్/ థ్రెడ్ బాలేకపోతే వెంటనే మార్చుకోండి
– వాహన టైర్లలోని గాలిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి
– వర్షం పడే సమయంలో పరిమిత వేగంతో వెళ్లడం మంచిది
– బ్రేక్ ప్యాడ్స్, విండ్ స్క్రీన్ వైపర్ల కండిషన్ చెక్ చేయించండి.
– వాహనాల్లో ఎమర్జెన్సీ కిట్ ఉంచుకోండి

Similar News

News January 13, 2025

ఉద్యోగుల సమస్యలపై ప్రతినెలా 2 సమావేశాలు

image

TG: రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల సర్వీస్ సమస్యలపై సత్వర పరిష్కారం కోసం ఆన్‌లైన్ విధానాన్ని తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రతి నెలా రెండో, నాలుగో శుక్రవారాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 వరకు సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈ నెల 24న తొలి భేటీకి మంత్రి సీతక్క హాజరవుతారని తెలిపారు. ఇకపై ఉద్యోగులెవరూ హైదరాబాద్ వరకు రావాల్సిన అవసరం లేదన్నారు.

News January 12, 2025

‘గేమ్ ఛేంజర్’ రెండు రోజుల కలెక్షన్లు ఎంతంటే?

image

‘గేమ్ ఛేంజర్’ మూవీకి రెండు రోజుల్లో రూ.270 కోట్ల కలెక్షన్లు వచ్చినట్లు అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లు వైరలవుతున్నాయి. దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది. తొలి రోజు రూ.186 కోట్లు వచ్చినట్లు నిర్మాతలు వెల్లడించారు. శంకర్ డైరెక్షన్‌లో రామ్ చరణ్, కియారా జంటగా నటించిన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వస్తున్న విషయం తెలిసిందే.

News January 12, 2025

శరద్, ఉద్ధవ్ మోసపూరిత రాజకీయాలకు తెర: అమిత్ షా

image

NCP(SP) చీఫ్ శరద్ పవార్‌ మహారాష్ట్ర వేదికగా 1978 నుంచి మోసపూరిత రాజకీయాలు చేస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. సీఎంగా, కేంద్ర వ్యవసాయ మంత్రిగా పనిచేసినప్పటికీ ఆయన రైతు ఆత్మహత్యలను ఆపలేకపోయారని దుయ్యబట్టారు. పవార్ విధానాలతోపాటు ఉద్ధవ్ ఠాక్రే కుటుంబ, ద్రోహ రాజకీయాలకు 2024లో బీజేపీ విజయంతో తెరపడిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో శరద్, ఉద్ధవ్‌ల స్థానమేంటో ప్రజలు చూపించారని తెలిపారు.