News July 4, 2024
ALERT: EAMCET(ఇంజనీరింగ్) మొదటి విడత కౌన్సెలింగ్ షెడ్యూల్
TS EAMCET -2024( ఇంజనీరింగ్) మొదటి విడత కౌన్సెలింగ్ నేటి(JULY4) నుండి ప్రారంభం కాగా… JULY 12 వరకు ఆన్లైన్ లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకునేందుకు అవకాశం కలదు.
✓JULY6 నుండి 13 వరకు స్లాట్ బుక్ చేసుకున్న వారికి సర్టిఫికెట్ వెరిఫికేషన్
✓JULY 8 నుంచి 15 వరకు వెబ్ ఆప్షన్ ఎంపిక
✓JULY 19 మొదటి విడత సీట్ల కేటాయింపు
వెబ్సైట్: https://tgeapcet.nic.in
#SHARE IT
Similar News
News December 30, 2024
జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు గద్వాల జిల్లా యువకుడు
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండంలోని బింగిదొడ్డి గ్రామానికి చెందిన వేణు జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యాడు. తనకు సహకారం అందించిన కోచ్, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ స్థాయికి ఎంపికైన యువకుడిని గ్రామస్థులు అభినందించారు.
News December 30, 2024
మహబూబ్నగర్: డిగ్రీ విద్యార్థిని సూసైడ్
ఉరేసుకుని డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నవాబుపేట మండలం కాకర్లపహాడ్లో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అంకిత(18) మహబూబ్నగర్లో డిగ్రీ చదువుతోంది. ఆమె తల్లిదండ్రులు ఆలయంలో పని చేస్తుంటారు. కాగా, ఆదివారం వారు గుడికి వెళ్లి తిరిగి వచ్చే వరకు అంకిత ఇంట్లో ఉరేసుకుంది. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
News December 29, 2024
దౌల్తాబాద్: వలకు చిక్కిన కొండ చిలువ
కొడంగల్ నియోజవర్గంలోని దౌల్తాబాద్ పరిధిలో వేట వలలో భారీ కొండ చిలువ చిక్కింది. మండల కేంద్రంలోని దౌల్తాబాద్, రాళ్లపల్లి మధ్యలో ఉన్న అడవి సమీపంలో కొందరు వేటకు వేసిన వలలో కొండ చిలువ చిక్కింది. ఇవాళ ఉదయం వెళ్లిన వేటగాళ్లు వలలో చిక్కిన కొండ చిలువను చూసి భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులు, ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి కొండ చిలువను పట్టుకొని ఫారెస్టు ఆఫీసర్లకు అప్పగించారు.