News July 4, 2024
ALERT: EAMCET(ఇంజనీరింగ్) మొదటి విడత కౌన్సెలింగ్ షెడ్యూల్
TS EAMCET -2024( ఇంజనీరింగ్) మొదటి విడత కౌన్సెలింగ్ నేటి(JULY4) నుండి ప్రారంభం కాగా… JULY 12 వరకు ఆన్లైన్ లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకునేందుకు అవకాశం కలదు.
✓JULY6 నుండి 13 వరకు స్లాట్ బుక్ చేసుకున్న వారికి సర్టిఫికెట్ వెరిఫికేషన్
✓JULY 8 నుంచి 15 వరకు వెబ్ ఆప్షన్ ఎంపిక
✓JULY 19 మొదటి విడత సీట్ల కేటాయింపు
వెబ్సైట్: https://tgeapcet.nic.in
#SHARE IT
Similar News
News October 11, 2024
ఉమ్మడి జిల్లాలో నేటి వర్షపాత వివరాలు..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నేడు నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో 34.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. వనపర్తి జిల్లా రేవల్లిలో 31.8 మిల్లీమీటర్లు, మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంటలో 24.0 మిల్లీమీటర్లు, నారాయణపేట జిల్లా కృష్ణలో 13.0 మిల్లీమీటర్లు, గద్వాల జిల్లా మల్దకల్ లో 11.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
News October 11, 2024
MBNR: DSCలో 967 పోస్టుల భర్తీ
ఉమ్మడి పాలమూరు జిల్లాలో డీఎస్సీ-2024లో అర్హత సాధించిన అభ్యర్థుల్లో 967 మందికి నియామక పత్రాలు అందజేశారు. జిల్లా మొత్తం 1131 పోస్టులు ఉండగా 164 పోస్టులు పెండింగులో ఉన్నాయి. వీటిల్లో NGKL జిల్లాలో 59, మహబూబ్ నగర్ జిల్లాలో 29, గద్వాలలో 23, వనపర్తిలో 26, నారాయణపేటలో 27 పోస్టులను రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్లు, స్పెషల్ ఎడ్యుకేటర్స్, కోర్టు కేసులు, తదితర కారణాలతో భర్తీ చేయలేదు.
News October 11, 2024
వనపర్తి: అత్యాచారం.. ఆపై హత్య
గోపాల్‌పేట మం. ధర్మాతండాకు చెందిన <<14319594>>శాంతమ్మ<<>> మృతి కేసును పోలీసుల ఛేదించారు. పోలీసుల వివరాలు.. అత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్లు విచారణలో తేలింది. వనపర్తిలో ఉంటున్న NGKL జిల్లా పెంట్లవెల్లికి చెందిన ప్రభాకర్.. స్థానిక గాంధీ చౌక్‌లో కూరగాయలు కొంటున్న శాంతమ్మను మాటల్లో పెట్టాడు. మద్యం తాగించి తీసుకెళ్లి చిమనగుంటపల్లి శివారులో అత్యాచారం చేశారు. అనంతరం పక్కనే ఉన్న బావిలో తోసి అక్కడి నుంచి పరారయ్యాడు.