News September 30, 2024

ALERT: ఉప్పు అధికంగా తీసుకుంటున్నారా?

image

రోజుకు 1 టీస్పూన్ ఉప్పు మాత్రమే తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. అంతకంటే ఎక్కువ తింటే రక్తపోటును పెంచుతుందని హెచ్చరించింది. ఇది గుండె జబ్బులు & స్ట్రోక్‌కు ప్రమాద కారకమని పేర్కొంది. సిఫార్సు చేసిన పరిమితికి ఉప్పు వినియోగాన్ని తగ్గిస్తే సంవత్సరానికి 2.5 మిలియన్ల మరణాలను నివారించవచ్చని అంచనా వేసింది. కాగా, ఒక నెలపాటు ఉప్పు తినడం ఆపేస్తే బరువు తగ్గుతారని వైద్యులు చెబుతున్నారు.

Similar News

News September 30, 2024

‘సత్యం సుందరం’ సినిమా నుంచి 18 నిమిషాలు కట్!

image

తమిళ స్టార్ హీరో కార్తీ నటించిన ‘సత్యం సుందరం’ సినిమా థియేటర్లలో విజయవంతంగా కొనసాగుతోంది. అయితే, సినిమాలోని 18 నిమిషాలను ట్రిమ్ చేసినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. కట్ చేసిన వెర్షన్ ఈరోజు నుంచి థియేటర్లలో ప్రదర్శించనున్నట్లు తెలిపాయి. కాగా, సెకండ్ ఆఫ్‌లో కార్తీ & అరవింద్‌స్వామి మధ్య జరిగే సుదీర్ఘ సంభాషణను ట్రిమ్ చేసి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నాయి.

News September 30, 2024

WTCలో చరిత్ర సృష్టించిన అశ్విన్

image

బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో భారత బౌలర్ అశ్విన్ చరిత్ర సృష్టించారు. వరుసగా 3 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్స్(WTC)లో 50+ వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలిచారు. ఇతను 2019-21లో 71, 2021-23లో 61, 2023-25లో 50* వికెట్లు తీశారు. నాథన్ లియాన్, పాట్ కమిన్స్, టిమ్ సౌథీ రెండు సీజన్లలో 50+ వికెట్లు పడగొట్టారు. కాగా ఓవరాల్‌గా WTCలో 187 వికెట్లతో లియాన్ టాప్‌లో ఉండగా, అశ్విన్(182) రెండో స్థానంలో ఉన్నారు.

News September 30, 2024

లైంగిక వేధింపుల కేసులో నటుడికి ముందస్తు బెయిల్

image

లైంగిక వేధింపుల కేసులో మాలీవుడ్ న‌టుడు సిద్ధిక్‌కి సుప్రీంకోర్టు ముంద‌స్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే పోలీసుల‌ విచార‌ణ‌కు స‌హ‌క‌రించాల‌ని ఆదేశించింది. ఆయ‌న‌పై వేధింపుల ఆరోప‌ణ‌లు రావ‌డంతో కేరళ పోలీసులు విచార‌ణ చేపట్టారు. ఈ నేపథ్యంలో సిద్ధిక్ దాఖ‌లు చేసిన‌ ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్‌ను కేర‌ళ హైకోర్టు కొట్టేసింది. దీంతో సుప్రీంను ఆశ్రయించగా తాజాగా ఆయ‌న‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగింది.