News August 19, 2024
ALERT: ఎంపాక్స్ లక్షణాలివే..
> ఒంటి మీద దద్దుర్లు, జ్వరం, గొంతు నొప్పి, తల నొప్పి, కండరాల నొప్పులు, వెన్ను నొప్పి, బలహీనపడటం <<13894678>>ఎంపాక్స్ లక్షణాలు<<>>.
> ఈ లక్షణాలు వైరస్ సోకిన 1-21రోజుల్లో ఎప్పుడైనా కనిపించవచ్చు. రోగనిరోధక శక్తి తక్కువున్న వారిలో ఇది ఎక్కువకాలం ఉంటుంది.
> వైరస్ ఉన్న వారిని తాకడం, ముఖాముఖి మాట్లాడటం వల్ల వ్యాపిస్తుంది.
>> ఈ లక్షణాలుంటే మీరు వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి.
Similar News
News January 23, 2025
పుట్టిన రోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News January 23, 2025
సైఫ్‌ను కాపాడిన ఆటో డ్రైవర్‌కు ₹లక్ష ఇస్తా: సింగర్
సైఫ్ అలీఖాన్‌ను ఆస్పత్రికి తరలించిన ఆటో డ్రైవర్ భజన్ సింగ్‌ను బాలీవుడ్ సింగర్ మికా సింగ్ ప్రశంసించారు. ఫేవరెట్ సూపర్ స్టార్‌ను కాపాడిన ఆటో డ్రైవర్‌కు కనీసం రూ.11 లక్షల రివార్డ్ అయినా ఇవ్వాలి. ఆయన వివరాలు చెప్పండి. నా తరఫున రూ.లక్ష ఇవ్వాలనుకుంటున్నా’ అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. కాగా ఇవాళ ఆటో డ్రైవర్‌ను సైఫ్ కలిసి కృతజ్ఞతలు తెలిపిన సంగతి తెలిసిందే.
News January 23, 2025
దావోస్‌లో అందరం ఒక్కటే: సీఎం చంద్రబాబు
చరిత్రలో మొదటిసారి భారత్ తరఫున అందరం కలిసి మాట్లాడుతున్నామని AP సీఎం చంద్రబాబు అన్నారు. ‘భారత్ నుంచి పలు పార్టీలు వచ్చినా దావోస్‌లో అందరం ఒక్కటే. గతంలో ఒకరిద్దరు సీఎంలు, కేంద్రమంత్రులు వచ్చేవారు. భారత్ ఇక నుంచి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఏపీ సుస్థిరాభివృద్ధికి చాలా కష్టపడాలి’ అని దావోస్ ప్రెస్‌మీట్‌లో చంద్రబాబు అన్నారు. ఇందులో భారత్ నుంచి వెళ్లిన వివిధ రాష్ట్రాల నేతలు పాల్గొన్నారు.