News December 22, 2024

టెన్త్ విద్యార్థులకు ALERT.. మోడల్ పేపర్లు విడుదల

image

AP: టెన్త్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన మోడల్ పేపర్లను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. విద్యార్థులతో ఈ పేపర్లను ప్రాక్టీస్ చేయించాలని స్కూళ్లకు సూచించింది. <>ఆన్‌లైన్‌లో<<>> ప్రశ్నపత్రాలు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. ఈసారి క్వశ్చన్ బ్యాంక్ కొత్త వెర్షన్‌ను అందిస్తున్నట్లు పేర్కొంది. మార్చి 17 నుంచి 31 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే.

Similar News

News December 30, 2025

ఏలూరు జిల్లాను మోహరించిన పోలీసులు

image

వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలు భక్తులతో పోటెత్తాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని జిల్లా పోలీసు యంత్రాంగం పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. దర్శనం కోసం వేచి ఉండే భక్తుల మధ్య తోపులాటలు జరగకుండా, క్యూలైన్లను క్రమబద్ధీకరించడంలో పోలీసులు నిమగ్నమయ్యారు. భద్రతను పర్యవేక్షించడానికి తొలిసారిగా అధునాతన డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నారు.

News December 30, 2025

చిన్నప్పటి నుంచి కలిసి చదువుకుని.. మృత్యువులోనూ..

image

US యాక్సిడెంట్‌లో ఇద్దరు యువతులు మరణించడంతో పేరెంట్స్ గుండెలు బాదుకుంటున్నారు. మహబూబాబాద్‌(D)కు చెందిన <<18701423>>మేఘన<<>> (25), భావన(24) చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు. మూడేళ్ల క్రితం USకు వెళ్లి డేటన్ యూనివర్సిటీలో MS చేశారు. సోమవారం మరో ఇద్దరు ఫ్రెండ్స్‌ (HYD)తో కలిసి యాత్రకు వెళ్లారు. కారు లోయలో పడటంతో మేఘన, భావన మరణించగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.

News December 30, 2025

తిరుమలలో రద్దీ.. హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే

image

✱TTD హెల్ప్‌లైన్(టోల్ ఫ్రీ): 155257
✱విచారణ కార్యాలయం: 0877-2277777
✱అశ్విని ఆసుపత్రి (తిరుమల): 0877-2263457 / 2263458
✱అంబులెన్స్ సేవలు: 0877-2263666(నేరుగా 108కి కాల్ చేయొచ్చు)
✱మెయిన్ హాస్పిటల్ (తిరుపతి): 0877-228777
✱విజిలెన్స్ ఆఫీస్ (TTD Security): 0877-2263333
✱తిరుమల క్రైమ్ పార్టీ: 0877-2263939
✱తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్: 0877-2263833
✱ట్రాఫిక్ పోలీస్ స్టేషన్: 0877-2263733