News August 10, 2024
18 ఏళ్లు నిండే వారికి ALERT

తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియకు EC శ్రీకారం చుట్టింది. 2025 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే వారు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఓటు హక్కు కోసం <
Similar News
News January 17, 2026
USలో పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నారా? జాగ్రత్త!

అమెరికాలో ఇద్దరు భారత విద్యార్థులను ఇమిగ్రేషన్ & కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) కస్టడీలోకి తీసుకుంది. మిన్నెసోటాలోని సెయింట్ లూయిస్ పార్క్లో ప్రముఖ భారతీయ రెస్టారెంట్లో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. అక్కడ పని చేస్తున్న సిబ్బందిని ప్రశ్నించారు. F-1(స్టూడెంట్) వీసా నిబంధనలను ఉల్లంఘించి రెస్టారెంట్లో పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తున్నారనే కారణంతో ఇద్దరు ఇండియన్లను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.
News January 17, 2026
బాడీ స్ప్రే ఎక్కువగా వాడుతున్నారా?

చెమట నుంచి వచ్చే దుర్వాసనను తప్పించుకునేందుకు కొందరు, మంచి సువాసన కోసం మరికొందరు బాడీ స్ప్రేలు వాడుతుంటారు. అయితే వీటిని ఎక్కువగా వాడటం వల్ల పలు సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. ఇందులో ఉండే ప్రొపిలిన్ గ్లైకాల్ అనే రసాయనం వల్ల దీర్ఘకాలంలో కాంటాక్ట్ డెర్మటైటీస్, హైపర్ పిగ్మెంటేషన్, గ్రాన్యూలోనూ వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆల్కహాల్, పారాబెన్ లేని వాటిని వాడాలని సూచిస్తున్నారు.
News January 17, 2026
పురుషులకూ ఫ్రీ బస్సు: AIADMK

రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు AIADMK తొలి విడత మ్యానిఫెస్టో ప్రకటించింది. రేషన్ కార్డు ఉన్న మహిళలకు ప్రతి నెలా రూ.2వేలు, సిటీ బస్సుల్లో పురుషులకూ ఫ్రీ జర్నీ, ఇల్లు లేని వారికి ఉచిత ఇళ్ల నిర్మాణం, ఉపాధి హామీ పని దినాలు 150కి పెంపు, 5 లక్షల మంది మహిళలకు టూ వీలర్ స్కీమ్ కింద రూ.25వేల సబ్సిడీ వంటి హామీలను ప్రకటించింది.


