News September 5, 2024
క్రెడిట్ కార్డ్ యూజర్లకు అలర్ట్

క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ తమకు నచ్చిన కార్డ్ నెట్వర్క్ (మాస్టర్ కార్డ్, రూపే లేదా వీసా)ను ఎంచుకొనే విధంగా శుక్రవారం నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. కొత్త కార్డు కోసం దరఖాస్తు లేదా ఉన్న కార్డు రెన్యూవల్ సందర్భంగా యూజర్స్ తమకు నచ్చిన నెట్వర్క్ను ఎంచుకోవచ్చు. కస్టమర్ల ఎంపిక సామర్థ్యం మెరుగుపరచడం, డిజిటల్ చెల్లింపుల్లో పోటీతత్వం లక్ష్యంగా మార్చి 6న ఆర్బీఐ ఈ ఆదేశాలిచ్చింది.
Similar News
News January 4, 2026
ఈ నెలలో స్కూళ్లకు 14 రోజులు సెలవులు

ఏపీలో జనవరిలో స్కూళ్లకు దాదాపు సగం రోజులు సెలవులే ఉంటాయి. ఇవాళ (4), 10-18 తేదీల్లో 9 రోజులు సంక్రాంతి సెలవులు, 23న వసంత పంచమి, 25న ఆదివారం, 26న గణతంత్ర దినోత్సవం. ఇవి అన్ని స్కూళ్లకు వచ్చే 12 సెలవులు. ఇక నగరాల్లోని CBSE సిలబస్, ఇంటర్నేషనల్ స్కూళ్లు శనివారాలూ హాలిడే పాటిస్తున్నాయి. దీంతో వారికి అదనంగా మరో 3 సెలవులు కలిపి ఈ మంత్లో 14 రోజులు హాలిడేస్ అన్నట్లు. తెలంగాణలో ఈ సంఖ్య 10-12 రోజులు.
News January 4, 2026
అఖండ2: OTT డేట్ ప్రకటించిన NETFLIX

బాలకృష్ణ లేటెస్ట్ మూవీ అఖండ2 OTT రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయింది. ముందుగా ఊహించినట్లుగానే ఈనెల 9న మూవీ డిజిటల్ రిలీజ్ ఉంటుందని రైట్స్ పొందిన NETFLIX ప్రకటించింది.
News January 4, 2026
రేపటి నుంచి జాగ్రత్త!

TG: రాష్ట్రంలో రేపటి నుంచి చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. ఈ నెల 5 నుంచి 12వ తేదీ వరకు తీవ్ర చలిగాలులు వీస్తాయని పేర్కొన్నారు. పగటి ఉష్ణోగ్రతలతో పాటు రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుతాయని తెలిపారు. డే టైమ్ టెంపరేచర్లు 25-26 డిగ్రీల మధ్య నమోదవుతాయని అంటున్నారు. కాగా కొన్ని రోజులుగా ఉదయం పొగమంచు ఉంటున్నా చలి తీవ్రత తగ్గిన సంగతి తెలిసిందే.


