News April 16, 2025
తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్

AP: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు అలర్ట్. జులై నెలకు సంబంధించిన రూ.300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లను ఏప్రిల్ 24న రిలీజ్ చేయనున్నారు. ఆ రోజు ఉ.10 గంటలకు ఆన్‌లైన్‌లో టికెట్లు అందుబాటులో ఉంటాయని టీటీడీ తెలిపింది. వృద్ధులు, దివ్యాంగుల కోటా టికెట్లను ఏప్రిల్ 23 మ.3 గంటలకు విడుదల చేస్తామని పేర్కొంది. ఇక తిరుమల అంగప్రదక్షిణం టోకెన్లు ఏప్రిల్ 23న ఉ.10 గంటలకు అందుబాటులో ఉండనున్నాయి.
Similar News
News April 16, 2025
కాసేపట్లో వర్షం..

తెలంగాణలోని పలు జిల్లాల్లో మరికాసేపట్లో వర్షం కురుస్తుందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో తేలికపాటి జల్లులు, గం.కు40KM వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. VKB జిల్లాల్లో మోస్తరు వర్షాలు, గం.కు40-61KM వేగంతో గాలులు వీస్తాయని ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. అటు 3 రోజులు పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
News April 16, 2025
అనారోగ్యం భరించలేక యువకుడి ఆత్మహత్య

TG: మంచిర్యాల జిల్లాకు చెందిన చెల్మాటికారి అనిల్‌ను గత కొంతకాలంగా పచ్చకామెర్లు, దవడ బిళ్లలు, వైరల్ ఫీవర్ వేధిస్తున్నాయి. ఎన్ని మందులు వాడినా అనారోగ్యం తగ్గలేదు. దీంతో క్షమించమంటూ తల్లిదండ్రులకు లేఖ రాసి ఇంట్లోనే ఉరేసుకుని తనువు చాలించాడు. నెన్నెల మండలంలోని జెండా వెంకటాపూర్‌లో ఈ విషాదం చోటుచేసుకుంది. చేతికందొచ్చిన బిడ్డను కోల్పోవడంతో అతడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
News April 16, 2025
ప్రైవేటులా ప్రభుత్వ వైద్యం.. నెటిజన్ ట్వీట్ వైరల్

TG వైద్య సేవల తీరుపై ఓ నెటిజన్ చేసిన ట్వీట్ వైరలవుతోంది. ఉగాది రోజున AP నుంచి HYDకి వచ్చిన ఓ వ్యక్తి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో అంబులెన్సులో ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. వెంటనే ఎక్స్‌రే, USG చేసి పేగుకు రంధ్రం ఉందని ఆపరేషన్ చేసి అతణ్ని కాపాడారు. ఇతర రాష్ట్రం అని తెలిసినా కూడా ప్రైవేటు స్థాయిలో వైద్యం అందించిన వైద్యులు, TG ప్రభుత్వం, 108 సిబ్బందికి ధన్యవాదాలు అని అతను ట్వీట్ చేశాడు.