News December 16, 2024
శ్రీవారి భక్తులకు అలర్ట్

AP: నేటి నుంచి ధనుర్మాసం ప్రారంభమవడంతో తిరుమలలో రేపటి నుంచి జనవరి 14 వరకు సుప్రభాత సేవలను రద్దు చేశారు. ఈ విషయాన్ని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ట్వీట్ చేశారు. సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై పాశురాలతో శ్రీవారికి మేలుకొలుపు చేయనున్నట్లు పేర్కొన్నారు. బిల్వ పత్రాలతో సహస్ర నామార్చాన, శ్రీవిల్లి పుత్తూరు చిలుకలను స్వామివారికి అలంకరించనున్నారు. నైవేద్యంగా బెల్లం దోశ, సిరా, పొంగల్ నివేదించనున్నారు.
Similar News
News December 19, 2025
భారత జలాల్లోకి బంగ్లా బోట్లు.. కవ్వింపు చర్యలు?

భారత జలాల్లోకి బంగ్లాదేశ్ ఫిషింగ్ బోట్లు వస్తున్న ఘటనలు ఇటీవల పెరిగిపోతున్నాయి. 4 రోజుల కిందట బంగ్లా నేవీ గస్తీ నౌక ఇలానే వచ్చింది. బంగ్లాలో త్వరలో ఎన్నికలు ఉండటం, అక్కడ అల్లర్లు చెలరేగుతున్న నేపథ్యంలో భారత నిఘా వర్గాలు కీలక విషయాన్ని గుర్తించాయి. భారత్‌ను కవ్వించేందుకు బంగ్లా ఇలా చేస్తోందని వెల్లడించాయి. పేద జాలర్లను భారత్ వేధిస్తోందని చిత్రీకరించి ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నమని చెప్పాయి.
News December 19, 2025
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(UGC) 11 డొమైన్ ప్రొఫెషనల్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు రేపటి వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి పీజీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. జీతం నెలకు రూ.60,000-రూ.70,000వరకు చెల్లిస్తారు. వెబ్సైట్: https://www.ugc.gov.in
News December 19, 2025
వరద జలాలపై హక్కు ఏపీదే: రామానాయుడు

ఏటా 4వేల TMCల గోదావరి నీరు వృథాగా సముద్రంలో కలుస్తోందని మంత్రి రామానాయుడు ఢిల్లీలో మీడియాతో పేర్కొన్నారు. ‘వరద జలాలపై హక్కు కింది రాష్ట్రంగా APకే ఉంటుంది. పోలవరంపై 2011లో ఇచ్చిన స్టాప్ వర్క్ ఆర్డర్‌ను శాశ్వతంగా రద్దు చేయాలి. కెనాల్ల సామర్థ్యం 17వేల క్యూసెక్కులకు పెంచి ఆ అదనపు వ్యయాన్ని ప్రాజెక్టు ఖర్చులో చేర్చాలి. గోదావరి జలాలపై ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేయాలి’ అని కేంద్రాన్ని కోరారు.


