News February 4, 2025
శ్రీవారి భక్తులకు అలర్ట్

AP: రేపు రథసప్తమి కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులను సర్వదర్శనంలో అనుమతిస్తామని TTD EO శ్యామలరావు తెలిపారు. ఉ.5.30కు సూర్యప్రభ వాహన సేవతో ఈ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఉ.9-10 వరకు చిన్న శేష వాహన సేవ, ఉ.11-12 వరకు గరుడ వాహన సేవ, మ.1-2 వరకు హనుమంత వాహన సేవ, మ.2-3 వరకు చక్రస్నానం, సా.4-5 వరకు కల్పవృక్ష వాహన సేవ, సా.6-7 వరకు సర్వభూపాల వాహన సేవ, రా.8-9 వరకు చంద్రప్రభ వాహన సేవతో వేడుకలు ముగుస్తాయి.
Similar News
News April 5, 2026
టెస్టులపై BCCI ఫోకస్.. తర్వాతి తరాన్ని సిద్ధం చేసేందుకు ప్లాన్!

NZ, SAతో స్వదేశంలో టెస్ట్ సిరీస్‌లు ఓడటంతో BCCI రెడ్ బాల్ క్రికెట్‌పై ఫోకస్ పెట్టింది. జూన్/జులైలో 64 మంది U25 క్రికెటర్లతో రెడ్ బాల్ ఇంట్రా టోర్నీ నిర్వహించనుంది. వారిని 4 జట్లుగా విభజించి బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో మ్యాచులు ఆడించనున్నట్లు BCCI అధికారి ఒకరు తెలిపారు. ఇందులోనుంచి 25 మందిని సెలక్ట్ చేసి టెస్టుల కోసం సిద్ధం చేస్తారు. ఈ లిస్టులో వైభవ్, మాత్రే కూడా ఉంటారని సమాచారం.
News April 5, 2026
VFXపై విమర్శలు కరెక్ట్ కాదు: హృతిక్ రోషన్

సినిమాల్లోని VFXను కనీస అవగాహనతో విమర్శించాలని ఆడియన్స్‌కు హీరో హృతిక్ రోషన్ సూచించారు. ‘మనం ఎన్నడూ చూడని వాటిని రామాయణ, కల్కి, బాహుబలి వంటి సినిమాలతో మేకర్స్ చూపిస్తున్నారు. ఎంతో ఖర్చు చేస్తూ కష్టపడుతున్నారు. VFXలో చాలా స్టైల్స్ ఉంటాయి. మేకర్స్ ఎంచుకున్న స్టైల్ మీకు నచ్చకపోవచ్చు. కానీ ఇక నుంచి VFX కథకు సరిపోయిందా? మేకర్స్ తాము అనుకున్నది చూపించారా అని కూడా ఆలోచించండి’ అని SMలో పోస్ట్ పెట్టారు.
News April 5, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.


