News August 20, 2025
DSC అభ్యర్థులకు అలర్ట్

AP: మెగా DSC 2025 స్కోరు కార్డులకు సంబంధించి టెట్ మార్కుల్లో అభ్యంతరాలకు ఇచ్చిన ఎడిట్ ఆప్షన్ గడువు రేపటితో ముగియనుంది. ఇదే చివరి అవకాశం అని, ఏవైనా అభ్యంతరాలుంటే రేపు మ.12.00లోగా సరిచేసుకోవాలని కన్వీనర్ కృష్ణారెడ్డి సూచించారు. సవరించిన టెట్ మార్కులతో అనుసంధానించిన స్కోర్ కార్డులను <
Similar News
News March 21, 2026
HYD: MMTS 2వ దశకు రూ.50కోట్లు

MMTS 2వ దశ కోసం ప్రభుత్వం రూ.50 కోట్లు కేటాయించింది. రెండో దశలో నగర శివారు ప్రాంతాలను కలుపుతూ ఆరు మార్గాల్లో ఎంఎంటీఎస్ విస్తరణ చేపట్టారు. అప్పట్లో రూ.850 కోట్లతో ప్రణాళికలను రూపొందించారు. ప్రాజెక్టు జాప్యంతో ఇది రూ.1.150 కోట్లు దాటింది. రాష్ట్ర ప్రభుత్వం 1/3, రైల్వేశాఖ 1/4 చొప్పున నిధులు అందజేయాలి. ఈ మేరకు ఏటా బడ్జెట్‌లో MMTS కోసం కేటాయిస్తున్నారు.
News March 21, 2026
భక్తులకు అల్పాహారం వడ్డించిన చంద్రబాబు

AP: తిరుమలలో భక్తులకు సీఎం చంద్రబాబు అల్పాహారం వడ్డించారు. శ్రీవారి దర్శనం అనంతరం కుటుంబ సమేతంగా ఆయన వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి వెళ్లారు. అక్కడ CBN, భువనేశ్వరి, లోకేశ్, దేవాన్ష్ వడ్డించారు. తర్వాత వారు అల్పాహారం స్వీకరించారు. దేవాన్ష్ పేరుతో ఒక్కరోజు అన్నదాన వితరణకు రూ.44 లక్షలు విరాళం అందించారు. ఏటా తన మనవడి పుట్టిన రోజు సందర్భంగా విరాళం అందజేస్తున్నారు.
News March 21, 2026
యశ్ దయాల్‌కు షాక్ ఇచ్చిన RCB!

మరో వారంలో IPL ప్రారంభం కానుండగా RCB కీలక బౌలర్ యశ్ దయాల్ ప్రాక్టీస్ క్యాంపులో కనిపించకపోవడం చర్చకు దారి తీస్తోంది. ఆయనపై రేప్ <<17189705>>ఆరోపణలు<<>> ఉన్న నేపథ్యంలో జట్టు నుంచి తప్పించి ఉంటారని క్రీడావర్గాలు చెబుతున్నాయి. ఇక టీమ్ ట్రావెల్ బస్సుపై యశ్ మినహా మిగతా ప్లేయర్లందరి ఫొటోలు ఉండటం దీనికి బలం చేకూరుస్తోంది. అటు దయాల్ గత నెల రహస్యంగా పెళ్లి చేసుకోగా ఇటీవల ఆ విషయం బయటికొచ్చిన విషయం తెలిసిందే.


