News August 3, 2024

డీఎస్సీ అభ్యర్థులకు ALERT.. టెట్ దరఖాస్తుకు ఇవాళే లాస్ట్

image

AP: రాష్ట్రంలో టెట్ దరఖాస్తుకు ఇవాళే చివరి తేదీ. ఇప్పటికే ఓ సారి గడువు పొడిగించినందున మరోసారి అవకాశం ఉండకపోవచ్చు. SEP 22 నుంచి హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయి. OCT 3 నుంచి 20 వరకు పరీక్షలు జరుగుతాయి. ఫైనల్ కీని అక్టోబర్ 27న, ఫలితాలను నవంబర్ 2న విడుదల చేస్తారు. మెగా డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.
వెబ్‌సైట్: <>https://aptet.apcfss.in<<>>

Similar News

News March 10, 2026

నేపాల్‌లో RSP ఘన విజయం.. మోదీ కంగ్రాట్స్

image

నేపాల్ సార్వత్రిక ఎన్నికల తుది ఫలితాలు వెల్లడయ్యాయి. 165 స్థానాలకు గాను రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ 125 చోట్ల గెలిచింది. నేపాలీ కాంగ్రెస్ 18, CPN(UML) 9, నేపాలీ కమ్యూనిస్ట్ పార్టీ 7, మిగతా పార్టీలు 5 స్థానాలను సొంతం చేసుకున్నాయి. ఓ చోట రిజల్ట్ పెండింగ్‌లో ఉంది. ఘన విజయం సాధించిన RSP ప్రెసిడెంట్ రవి లామిచానే, ప్రధాని అభ్యర్థి బాలెన్ షాతో PM మోదీ ఫోన్‌లో మాట్లాడారు. వారికి శుభాకాంక్షలు తెలిపారు.

News March 10, 2026

4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు.. వారంలో షెడ్యూల్?

image

అస్సాం, కేరళ, WB, TN, పుదుచ్చేరి(UT)లో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. EC వారంలో షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం CEC జ్ఞానేశ్ కుమార్ ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షిస్తున్నారు. స్థానిక పండుగలను పరిగణనలోకి తీసుకోవాలని పలు పార్టీలు ECకి విజ్ఞప్తి చేశాయి. కాగా బెంగాల్‌లో ఎన్నికలను రెండు దశల్లోనే పూర్తి చేయాలని TMC, BJP, INC, CPM, AAP నేతలు కోరారు.

News March 10, 2026

ఇండియా వల్ల క్రికెట్ భ్రష్టుపట్టింది: అక్తర్ అక్కసు

image

భారత్ T20WC గెలవడంపై పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండియా ఆధిపత్యం వల్ల ఆట భ్రష్టుపట్టిందని అక్కసు వెళ్లగక్కారు. ‘ఓ రిచ్ కిడ్ తన పక్కనున్న పేదపిల్లలందరినీ పిలిచి క్రికెట్ ఆడదాం అన్నట్లుగా ఉంది ఇండియా వ్యవహారం’ అని విమర్శించారు. ఫైనల్‌కి ముందు కూడా ‘క్రికెట్ మంచి కోసం న్యూజిలాండ్ గెలవాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. ఆయనపై ఇండియన్ ఫ్యాన్స్‌ SMలో ఫైర్ అవుతున్నారు.