News September 28, 2024

డిగ్రీ పూర్తైన వారికి ALERT

image

AP: ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో గ్రాడ్యుయేట్స్ MLA ఎన్నికలకు SEP 30 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఫారం-18లో పాస్‌పోర్ట్ ఫొటో, గెజిటెడ్ ఆఫీసర్‌తో ధృవీకరించిన డిగ్రీ సర్టిఫికెట్ జిరాక్స్, ఎపిక్ కార్డు, ఆధార్ కార్డు జతపరచాలి. 2021 జూన్‌లోపు డిగ్రీ పూర్తైనవారు దరఖాస్తుకు అర్హులు. 10+2+3 విధానంలో పాసైన వారు మాత్రమే ఓటరుగా నమోదు చేసుకోవాలి. టెన్త్ తర్వాత డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చదివిన వారు అనర్హులు.

Similar News

News September 28, 2024

ఇథ‌నాల్, చక్కెర కనీస అమ్మకపు ధ‌ర‌ల పెంపుపై కేంద్రం యోచ‌న‌

image

ఇథనాల్, చక్కెర కనీస అమ్మకపు ధర (2019 ఫిబ్రవరి నుంచి కిలోకు రూ.31) పెంపు స‌హా 2024-25లో చక్కెర ఎగుమతి విధానాన్ని సమీక్షించడంపై కేంద్రం దృష్టి సారించింది. ఇథనాల్ ధరను పెంచే విషయం పరిశీలనలో ఉంద‌ని, ఈ విష‌య‌మై పెట్రోలియం మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతున్న‌ట్టు కేంద్ర మంత్రి ప్ర‌హ్లాద్ జోషి తెలిపారు. ఇక ఎగుమ‌తుల‌పై వ‌చ్చే ఏడాది ఉత్ప‌త్తి, ల‌భ్య‌త ఆధారంగా నిర్ణ‌యిస్తామ‌ని వెల్ల‌డించారు.

News September 28, 2024

ఎస్సీ వర్గీకరణపై అభిప్రాయాల సేకరణ

image

TG: ఎస్సీ వర్గీకరణపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. వర్గీకరణపై వివిధ సంఘాలు, వ్యక్తుల నుంచి అభిప్రాయాలు సేకరించాలని నిర్ణయించింది. ఈ నెల 30 నుంచి మాసబ్ ట్యాంక్ లోని ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యాలయంలో అభిప్రాయాలు ఇవ్వాలని తెలిపింది.

News September 28, 2024

ఇంగ్లిష్ మీడియా.. మా మీద పడి ఏడవకండి: గవాస్కర్

image

చెన్నైలో ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్ ఆడినప్పుడు పిచ్ బాలేదంటూ ఇంగ్లిష్ వార్తాసంస్థలు ఏడ్చాయని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ గుర్తుచేసుకున్నారు. కాన్పూర్‌లో రెండో టెస్టు సందర్భంగా కామెంటరీలో ఆయన మాట్లాడారు. ‘జాగ్రత్తగా ఆడితే ఆ పిచ్‌పై సెంచరీ చేయొచ్చని అశ్విన్ ఆ టెస్టుకు ముందే అన్నారు. అదే చేసి చూపించారు. ఇంగ్లిష్ మీడియా మాత్రం ఇవేం పిచ్‌లు అంటూ మనపై పడి ఏడ్చింది. ఆ ఏడుపులు ఆపండి’ అని పేర్కొన్నారు.