News August 13, 2025

గ్రూప్-2 అభ్యర్థులకు ALERT

image

TG: గ్రూప్-2 అభ్యర్థుల సెకండ్ స్పెల్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలను TGPSC విడుదల చేసింది. ఆగస్టు 20 నుంచి 23 వరకు అభ్యర్థులు సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీలో వెరిఫికేషన్ చేయించుకోవాలంది. అభ్యర్థులు ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు ఆప్షన్లు ఎంచుకోవాలని వెల్లడించింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరుకాని అభ్యర్థులు తదుపరి ప్రక్రియకు ఎంపికకారని TGPSC తెలిపింది. మరిన్ని వివరాలకు <>వె‌బ్‌సైటును <<>>సంప్రదించండి.

Similar News

News February 3, 2026

మెదక్: నిబంధనలకు లోబడి గుర్తులు కేటాయింపు: కలెక్టర్

image

రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి అభ్యర్థులకు గుర్తులు కేటాయింపు పోటీ చేసే అభ్యర్థుల జాబితా ఫారం-7 ద్వారా ప్రకటించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో రిటర్నింగ్ అధికారులకు టెలి కాన్ఫరెన్స్ ద్వారా పోటీ చేసే అభ్యర్థుల జాబితా ప్రకటన ఎన్నికల గుర్తుల కేటాయింపుపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

News February 2, 2026

నెయ్యిలో జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు: పవన్

image

AP: రసాయనాలతో తిరుమల లడ్డూ ప్రసాదం తయారుచేసి YCP మహాపరాధం చేసిందని Dy.CM పవన్ ఆరోపించారు. నెయ్యిలో జంతు కొవ్వు లేదని సిట్ నివేదికలో ఎక్కడా పేర్కొనలేదని, అయినా YCP విష ప్రచారం చేస్తోందని విమర్శించారు. ‘లడ్డూలో వినియోగించిన నెయ్యి అసలు నెయ్యే కాదు. రూ.400కి కిలో నువ్వుల నూనె దొరకదు.. అలాంటిది ఆవు నెయ్యి ఎలా ఇచ్చారు? దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి’ అని పార్టీ మీటింగ్‌లో నేతలకు సూచించారు.

News February 2, 2026

ఈ FEB అరుదైన నెల అంటూ ప్రచారం.. నిజమెంత?

image

2026 ఫిబ్రవరి 823 ఏళ్లకోసారి వచ్చే అరుదైన నెల అంటూ SMలో ప్రచారం జరుగుతోంది. ఈ నెలలో ప్రతి వారం సరిగ్గా 4 సార్లు రావడమే ఇందుకు కారణం. అయితే ఈ ప్రచారం అవాస్తవం. నిజానికి లీప్ ఇయర్ కాని ప్రతి ఏటా FEBలో 28 రోజులే ఉంటాయి. అంటే ప్రతి వారం కచ్చితంగా 4 సార్లే వస్తుంది. ఈ ఏడాది ఫిబ్రవరి ఆదివారంతో మొదలవడంతో క్యాలెండర్‌లో తేదీలు క్రమ పద్ధతిలో కనిపిస్తున్నాయి. గతంలో 2015లో ఇలాగే జరగగా, 2037లోనూ రానుంది.