News February 20, 2025
HDFC ఖాతాదారులకు అలర్ట్

HDFC ఖాతాదారుల UPI పేమెంట్స్ 22వ తేదీ సేవలు నిలిచిపోనున్నట్లు ఆ బ్యాంక్ తెలిపింది. ఆ రోజు తెల్లవారుజామున 2.30 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు HDFC ఖాతా లింక్ అయిన UPI సేవలు పని చేయవని వెల్లడించింది. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడానికి సిస్టం మెయింటెనెన్స్ చేపడుతున్నట్లు HDFC పేర్కొంది. అయితే, ఆ సమయంలో లావాదేవీల కోసం PayZapp ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేసింది.
Similar News
News December 4, 2025
VKB: జిల్లాలో 26 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం

తాండూర్ నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో 26 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. ఇందులో కరన్ కోట్, రాంపూర్ తండా, వీరారెడ్డిపల్లి, బిజ్వార్, చిట్టి ఘనపూర్, లక్ష్మీనారాయణపూర్, గంగసాగర్, దేవులతాండ, కిష్టాపూర్, రుద్రారం, బుగ్గాపూర్ పలు గ్రామాలు ఉన్నాయి. ఏకగ్రీవమైన పంచాయతీలు ఈ నెలాఖరు వరకు అధికారికంగా ప్రకటించనున్నారు.
News December 4, 2025
పుతిన్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న రాజభవనం గురించి తెలుసా?

రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఢిల్లీలోని చారిత్రక ‘హైదరాబాద్ హౌస్’ ఆతిథ్యం ఇవ్వనుంది. ఒకప్పుడు ప్రపంచ ధనవంతుడిగా పేరొందిన చివరి నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ ఈ రాజ భవనాన్ని కట్టించారు. సీతాకోకచిలుక ఆకారంలో నిర్మించేందుకు 2L పౌండ్లు(ఇప్పటి లెక్కల్లో ₹170 కోట్లు) ఖర్చు చేశారు. 8.6 ఎకరాల ప్యాలెస్‌లో 36 గదులు, మెట్ల మార్గాలు, ఫౌంటైన్లు వంటివెన్నో ఉన్నాయి. ఎంతో మంది దేశాధినేతలు ఇక్కడ ఆతిథ్యం స్వీకరించారు.
News December 4, 2025
ఏడాదిలో సరికొత్త టోల్ వ్యవస్థ: గడ్కరీ

ప్రస్తుతం ఉన్న టోల్ వ్యవస్థ ఏడాదిలోపే కనుమరుగవుతుందని కేంద్ర మంత్రి గడ్కరీ వెల్లడించారు. దాని స్థానంలో ఎలక్ట్రానిక్ సిస్టమ్‌ను అమలు చేస్తామని చెప్పారు. దీనివల్ల టోల్ పేరుతో NHలపై ఎక్కడా ఆగకుండా ప్రయాణించవచ్చన్నారు. ప్రస్తుతం 10 ప్రాంతాల్లో అమలవుతోన్న ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా విస్తరిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం రూ.10 లక్షల కోట్లతో 4,500 హైవే ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని లోక్‌సభలో తెలిపారు.


