News November 29, 2024
అమెరికాలో చదివే భారత విద్యార్థులకు అలర్ట్
అమెరికాలో చదువుతున్న భారత విద్యార్థులతో పాటు ఇతర దేశాల స్టూడెంట్లకు అక్కడి యూనివర్సిటీలు కీలక సూచనలు చేశాయి. శీతాకాలం సెలవులకు స్వదేశానికి వెళ్లిన విద్యార్థులు ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణం చేయడానికి (జనవరి 20) ముందే USA వచ్చేయాలని మెసేజులు పంపుతున్నాయి. వ్యాలిడ్ వీసాలు ఉన్న విద్యార్థులకు ట్రంప్ విధానాలతో ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా ఛాన్స్ తీసుకోకూడదని యూనివర్సిటీలు భావిస్తున్నట్లు సమాచారం.
Similar News
News November 29, 2024
ఇదేం తిక్క వాదన జగన్?: టీడీపీ
AP: కరెంటులో రూ.వేల కోట్ల దొంగతనం బయటపడకుండా మాజీ సీఎం జగన్ తలతిక్క పోలిక చేశారని టీడీపీ మండిపడింది. 2015 సంవత్సరం ధరతో 2021 ధర పోల్చి తిక్క వాదన చేయడం ఏంటని ప్రశ్నించింది. టెక్నాలజీ పెరిగే కొద్దీ ఛార్జీలు తగ్గుతాయనే కనీస బుర్ర కూడా లేదా? అని నిలదీసింది. ‘2015లో చంద్రబాబు రూ.4.43కి కొన్నారు. నేను 2021లో రూ.2.49కి కొన్నాను అంటావా’ అంటూ ట్వీట్ చేసింది.
News November 29, 2024
స్కిల్ స్కామ్: చంద్రబాబు బెయిల్ రద్దుపై విచారణ వాయిదా
AP: స్కిల్ స్కామ్ కేసులో CM చంద్రబాబు బెయిల్ను రద్దు చేయాలని గతంలో CID దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గి వర్చువల్గా వాదనలు వినిపించారు. ఈ పిటిషన్పై తాము త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తాను ప్రస్తుతం ఢిల్లీలో లేనందున మరింత సమయం ఇవ్వాలని కోరారు. దీంతో జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం విచారణను జనవరి రెండో వారానికి వాయిదా వేసింది.
News November 29, 2024
రేపు ‘అనంత’కు సీఎం చంద్రబాబు.. పెన్షన్ల పంపిణీ
AP: సీఎం చంద్రబాబు రేపు అనంతపురం జిల్లా బొమ్మనహాల్లో పర్యటించనున్నారు. నేమకల్లు ఇందిరమ్మ కాలనీలో మధ్యాహ్నం 1.25 నుంచి 1.55 వరకు లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేస్తారు. అదే గ్రామంలో ఆంజనేయస్వామిని దర్శించుకుంటారు. అనంతరం ఓ గంట పాటు స్థానిక ప్రజలతో సమావేశమై అర్జీలను స్వీకరిస్తారు. మ.3.45 గంటలకు హెలికాప్టర్లో బెంగళూరుకు బయలుదేరుతారు.