News October 8, 2024
ఇంటర్ విద్యార్థులకు అలర్ట్

AP: ఇంటర్ మొదటి, రెండో ఏడాది చదివే విద్యార్థులు తప్పనిసరిగా 75 శాతం హాజరు కలిగి ఉండాలని బోర్డు కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. హాజరు శాతం 60-65గా ఉంటే రూ.2వేలు, 65-70గా ఉంటే రూ.1,500, 70-75గా ఉంటే రూ.వెయ్యి చెల్లించాలన్నారు. 60శాతం కంటే తక్కువ ఉన్న సైన్స్ విద్యార్థులు పరీక్షలు రాసేందుకు అనర్హులని పేర్కొన్నారు. ఆర్ట్స్ విద్యార్థులను ప్రైవేట్‌గా పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు.
Similar News
News December 2, 2025
సీఎం పర్యటన షెడ్యూల్ విడుదల..

డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు బేగంపేట్ ఎయిర్ పోర్టుకు సీఎం చేరుకుని 12:50కి హెలికాప్టర్ ద్వారా కొత్తగూడెం బయలుదేరుతారు. 2 గంటలకు భద్రాద్రి కలెక్టరేట్‌కు చేరుకుంటారు. 2:15 నుంచి 2:40 గంటల మధ్య యూనివర్సిటీని ప్రారంభిస్తారు. 2:45 నుంచి 3:45 గంటల వరకు యూనివర్సిటీ ప్రాంగణంలోని గ్రౌండ్లో జరిగే సభలో CM ప్రసంగిస్తారు.
News December 2, 2025
ఈ ఆపిల్ ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది

సాధారణ ఆపిల్స్‌ను ఫ్రిజ్‌లో ఉంచితే కొన్ని రోజులకే రుచి మారిపోతాయి. అయితే ‘కాస్మిక్ క్రిస్ప్’ అనే ఆపిల్ మాత్రం చల్లని ఉష్ణోగ్రత వద్ద కొన్ని నెలల పాటు నిల్వ ఉంటుంది. రుచి మారదు. అలాగే దీన్ని కోసిన తర్వాత కూడా ముక్కలు చాలా సేపటి తర్వాతే గోధుమ రంగులోకి మారతాయి. వాషింగ్టన్ స్టేట్ వర్శిటీ 20 ఏళ్ల పాటు పరిశోధనలు చేసి దీన్ని రూపొందించింది. ఇది ఎరుపు రంగులో తీపి, పులుపుగా, ముక్కకాస్త దృఢంగా ఉంటుంది.
News December 2, 2025
పింఛన్ల రద్దు అని వైసీపీ ట్వీట్.. ఏపీ ఫ్యాక్ట్ చెక్ క్లారిటీ

AP: పింఛన్లు రద్దు చేస్తున్నారని YCP చేసిన ట్వీట్‌పై ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. పెన్షన్లలో కోతలేదని.. ఈ నెల 8,000 మందికి కొత్తగా మంజూరు చేసినట్లు తెలిపింది. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిన్నరలోనే రూ.50,763 కోట్లు పింఛన్లకే ఖర్చు చేసిందని పేర్కొంది. డిసెంబర్లో 63.25 లక్షల మందికి రూ.2,739 కోట్లు అందించిందని వెల్లడించింది. తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని హెచ్చరించింది.


