News April 7, 2025
ఇంటర్ విద్యార్థులకు అలర్ట్

తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాయి. ఇంజినీరింగ్‌పై ఆసక్తి ఉన్న విద్యార్థులు ఎంట్రన్స్ టెస్ట్‌లకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే JEE మెయిన్ రెండో సెషన్ పూర్తికావొచ్చింది. TGEAPCET(చివరి తేదీ APR 9), APEAPCET(లాస్ట్ డేట్ APR 24) దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. వీటితో పాటు బిట్స్, విట్టీ, SRM, సిట్టీ వంటి ప్రైవేటు సంస్థలు దేశవ్యాప్తంగా టెస్ట్స్ నిర్వహిస్తున్నాయి. వీటిపైనా ఓ లుక్కేయండి.
Similar News
News April 9, 2025
మహావీర్ జయంతి: రేపు ఐచ్ఛిక సెలవు

రేపు మహావీర్ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆప్షనల్ (ఐచ్ఛిక) హాలిడే ప్రకటించింది. అలాగే స్టాక్ మార్కెట్లకు సైతం హాలిడే ఉండనుంది. కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సైతం సెలవు ప్రకటించారు (ఏపీ, తెలంగాణలో లేదు). 24వ తీర్థంకరుడైన భగవాన్ మహావీర్ జన్మదినాన్ని మహావీర్ జయంతిగా జరుపుకుంటారు. ఈయన జైన మత విస్తరణకు విశేష కృషి చేశారు.
News April 9, 2025
అందుకే రెండో పెళ్లి చేసుకోలేదు: రేణు దేశాయ్

పవన్ కళ్యాణ్‌తో విడాకుల అనంతరం తనకు మళ్లీ పెళ్లి చేసుకోవాలనిపించినా పిల్లల కోసం చేసుకోలేదని రేణు దేశాయ్ తెలిపారు. ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ‘నేను మళ్లీ పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించాను. ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నా. కానీ అటు ఆ రిలేషన్‌షిప్‌కి, ఇటు పిల్లలకి న్యాయం చేయలేనని గ్రహించా. నా కూతురు ఆద్యకు ప్రస్తుతం 15yrs. బహుశా ఆమెకు 18yrs వచ్చాక పెళ్లి గురించి ఆలోచిస్తానేమో’ అని పేర్కొన్నారు.
News April 9, 2025
అమెరికా ఆధిపత్యాన్ని సహించం: చైనా

అమెరికా విధిస్తున్న భారీ సుంకాలపై చైనా మండిపడింది. ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO)లో ఫిర్యాదు చేసింది. ‘భారీగా టారిఫ్స్ విధిస్తూ అమెరికా మాపై ఒత్తిడి పెంచుతోంది. ఈ ఆధిపత్య ధోరణిని మేం సహించబోం. ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు చర్చలు జరిపితే మంచిది. లేదంటే మేం కూడా అలాగే వ్యవహరిస్తాం’ అని చైనా విదేశాంగ ప్రతినిధి వెల్లడించారు. USపై విధించే టారిఫ్‌ను చైనా తాజాగా 84%కి పెంచడం తెలిసిందే.