News April 6, 2024

MPC, BiPC విద్యార్థులకు అలర్ట్

image

TG: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే EAPCET-2024 దరఖాస్తుల గడువు నేటితో ముగియనుంది. ఆలస్య రుసుముతో కలిసి మే 1 వరకూ అప్లై చేసుకోవచ్చు. మే 7, 8 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ, మే 9, 10, 11 తేదీల్లో ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. గతంలో ఎంసెట్ పేరుతో ఈ ఎగ్జామ్ నిర్వహించేవారు. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు <>సైట్<<>>: https://eapcet.tsche.ac.in

Similar News

News December 13, 2025

22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్

image

TG స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్(టీజీ సెట్) పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. ఈ నెల 22, 23, 24 తేదీల్లో ఆన్‌లైన్ విధానంలో ఎగ్జామ్స్ జరగనున్నాయి. టీజీ సెట్‌ను 45వేల మంది అభ్యర్థులు రాయనుండగా 18 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 18 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ అర్హత కోసం నిర్వహించే ఈ పరీక్షలు 2 షిఫ్టుల్లో జరగనున్నాయి.

News December 13, 2025

పొదుగు పెద్దగా ఉంటేనే ఎక్కువ పాలు వస్తాయా?

image

కొందరు గేదెను కొనుగోలు చేసే ముందు దాని పొదుగును చూస్తారు. పెద్ద పొదుగు ఉంటే అది ఎక్కువ పాలు ఇస్తుందని అనుకుంటారు. పెద్ద పొదుగు ఉన్నంత మాత్రాన అది ఎక్కువ పాలు ఇవ్వదు. పాలు పితికిన తర్వాత పొదుగు గాలి తీసిన బెలూన్‌లా మెత్తగా, ముడతలు పడే గుణం ఉండాలి. అలా కాకుండా పాలు తీశాక కూడా గట్టిగా ఉంటే అది మాంసపు పొదుగుగా గుర్తించాలి. అది ఎక్కువ పాల దిగుబడికి పనికిరాదని భావించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు.

News December 13, 2025

2026 కల్లా వెలిగొండ పనులు పూర్తి: మంత్రి నిమ్మల

image

AP: వెలిగొండ పనుల్లో రోజువారీ లక్ష్యాలను పెంచామని, 2026 కల్లా ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రాజెక్టు టన్నెల్‌లో 18KM లోపలి వరకు వెళ్లి పనులను పరిశీలించారు. ప్రస్తుత వర్క్‌తో పాటు డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ పూర్తి చేయడానికి రూ.4 వేల కోట్లు అవసరమవుతాయని ఆయన చెప్పారు. ఇన్ని పనులుండగా ప్రాజెక్టు పూర్తయిపోయిందని జగన్ జాతికి అంకితం చేయడం ఎంత విడ్డూరమో ఆలోచించాలన్నారు.