News August 18, 2024
రుణమాఫీ కాని రైతులకు అలర్ట్

TG: రుణమాఫీ కాలేదని రైతులు చేస్తున్న ఆందోళనలపై వ్యవసాయ శాఖ స్పందించింది. ‘ఆధార్, పాస్‌బుక్, రేషన్‌కార్డు వివరాలు సరిగా లేనివారి రుణమాఫీ పెండింగ్‌లో ఉంది. రైతులు వ్యవసాయ అధికారులను కలిసి, వివరాలు సరిచేసుకుంటే సొమ్ము ఖాతాల్లో జమ అవుతుంది. సాంకేతిక కారణాలతో కొందరి మాఫీ డబ్బులు వెనక్కి వచ్చాయి. మళ్లీ జమ చేశాం. రైతులు ఫిర్యాదు చేస్తే నెలలోగా పరిశీలించి, అర్హులకు మాఫీ వర్తింపజేస్తాం’ అని ప్రకటించింది.
Similar News
News October 26, 2025
టాస్ గెలిచిన భారత్

WWC: లీగ్ స్టేజిలో చివరి మ్యాచ్‌లో BANతో భారత్ తలపడుతోంది. ముంబై వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన IND బౌలింగ్ ఎంచుకుంది. వర్షం పడుతుండటంతో ఆట కాస్త ఆలస్యమవనుంది.
IND: ప్రతీకా, స్మృతి, హర్లీన్, రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్(C), దీప్తి, ఉమా, అమన్‌జోత్ కౌర్, రాధా యాదవ్, శ్రీచరణి, రేణుకా
BAN: సుమియా, రుబ్యా హైదర్, షర్మిన్, శోభన, సుల్తానా(C), షోర్నా, మోని, రబేయా, నహిదా, నిషితా, మరుఫా
News October 26, 2025
నారద భక్తి సూత్రాలు – 8

నిరోధస్తు లోకవేదవ్యాపార వ్యప:
మనం చేసే సాధారణ పనులైనా, దేవుడికి సంబంధించిన పనులైనా.. వాటి ఫలితం గురించి ఆలోచించకుండా ‘దేవుడా! నీ కోసమే చేస్తున్నాను’ అని వాటిని ఆయనకు అప్పగించాలని ఈసూత్రం సూచిస్తోంది. ఫలితంగా మన మనసులో ఆందోళన, స్వార్థం పోతాయని, మన ప్రతి పని దైవసేవగా మారుతుందని చెబుతోంది. ‘నేను చేస్తున్నాను’ అనే అహంకారం వదిలి ‘అంతా దేవుడే చేయిస్తున్నాడు’ అనే నమ్మకంతో ఉండటమే ఈ సూత్ర సారాంశం. <<-se>>#NBS<<>>
News October 26, 2025
విషాదం: మట్టిపెళ్లలు విరిగిపడతాయని పంపిస్తే..

కేరళలోని ఇడుక్కి జిల్లాలో దంపతులను దురదృష్టం వెంటాడింది. NH-85 విస్తరణ పనుల్లో భాగంగా మన్నంకందంలో కొండను తవ్వుతున్నారు. మట్టిపెళ్లలు విరిగిపడే అవకాశం ఉందని 22 కుటుంబాలను నిన్న సాయంత్రం రిలీఫ్ క్యాంపులకు తరలించారు. అయితే రాత్రికి భోజనం కోసం బిజు(48), సంధ్య దంపతులు ఇంటికి తిరిగి వచ్చారు. ఈ సమయంలో మట్టి, బురద ఆ ప్రాంతాన్ని ముంచెత్తాయి. బిజు చనిపోగా, సంధ్య తీవ్రంగా గాయపడ్డారు.


