News December 9, 2024

రైల్వే ప్రయాణికులకు అలర్ట్

image

రైల్వే ప్రయాణికులు IRCTCలో టికెట్ బుకింగ్ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ట్విటర్‌లో ఫిర్యాదులు చేస్తున్నారు. ఈక్రమంలో దీనిపై IRCTC ప్రకటన విడుదల చేసింది. నిర్వహణ కార్యకలాపాల కారణంగా ఈ-టికెటింగ్ సేవలు గంట సేపటి వరకు అందుబాటులో ఉండవని, తర్వాత ప్రయత్నించాలని పేర్కొంది. ఏవైనా సమస్యలుంటే 14646, 0755-6610661 లేదా 0755-4090600కు కాల్ చేయాలని సూచించింది.

Similar News

News November 28, 2025

గంగాపూ‌ర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇల్లంతకుంట వాసి మృతి

image

సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్ గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్డుపై ఆరబోసిన వడ్ల కుప్పపైకి ద్విచక్ర వాహనం ఎక్కి కిందపడడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తెనుగువానిపల్లెకు చెందిన రవీందర్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 28, 2025

సర్పంచ్ పదవి కోసమే పెళ్లి.. చివరకు!

image

TG: సర్పంచ్ అయ్యేందుకు హుటాహుటిన పెళ్లి చేసుకొని బోల్తా పడిన ఓ వ్యక్తిని నెటిజన్లు తెగ ట్రోల్స్ చేస్తున్నారు. కరీంనగర్(D) నాగిరెడ్డిపూర్ సర్పంచ్ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. దీంతో సర్పంచ్ అవ్వడం కోసం ముచ్చె శంకర్‌ వెంటనే నల్గొండ(D)కు చెందిన మహిళను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. మొన్న పెళ్లి జరగ్గా ఓటర్‌గా దరఖాస్తు చేయడంలో ఆలస్యం అయింది. ఆలోపే నోటిఫికేషన్ రావడంతో అతనికి నిరాశే మిగిలింది.

News November 28, 2025

నాన్-ఏసీ కోచ్‌ల్లోనూ దుప్పటి, దిండు

image

రైలు ప్రయాణికులకు సదరన్ రైల్వే శుభవార్త చెప్పింది. 2026 జనవరి 1 నుంచి నాన్-ఏసీ స్లీపర్‌లో కూడా దుప్పటి, దిండు సౌకర్యం అందుబాటులోకి వస్తుందని ప్రకటించింది. ఇందుకోసం ప్రయాణికులు నిర్ణీత ఛార్జీలు చెల్లించాలని పేర్కొంది. ఈ మేరకు రూ.50, రూ.30, రూ.20లలో మూడు ప్యాకేజీలు తీసుకొచ్చింది. ఈ సౌకర్యాన్ని చెన్నై డివిజన్ ఎంపిక చేసిన 10 రైళ్లలో ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తోంది.